మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత జనాలకు అర్ధం కావడం లేదా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ మన తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతుంది. ప్రపంచం తో పోటీ పడే పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే జనాల్లో మాత్రం ఏ విధంగా చూసినా సరే మార్పు మాత్రం కనపడటం లేదు. లాక్ డౌన్ ని ఎత్తివేయకుండానే జనాలు రోడ్ల మీదకు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. 

 

పోలీసులు కొడుతున్నా, కేసులు పెడుతున్నా ఎవరికి అర్ధం కావడం లేదు. పరిస్థితి దారుణంగా ఉందని చెప్పినా సరే ఎవరూ కూడా కనీసం లో కనీసం అర్ధం చేసుకోవడం లేదు. వాళ్లకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్, విశాఖ, గుంటూరు నగరాల్లో ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతున్నారు. కర్ఫ్యూ ఉన్నా సరే కొందరు లెక్క చేయడం లేదు. కేసులు పెట్టినా సరే ఎవరిలోకూడా మార్పు రావడం లేదు. 

 

ప్రధాన రోడ్ల మీద గుంపులు గుంపులు గా జనం ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. పని లేని పనికి రోడ్ల మీదకు వస్తున్నారు. ఒకపక్క కేసులు పెరుగుతున్నా సరే జనాల్లో మాత్రం ఏ విధంగా కూడా మార్పు రావడం లేదు. పరిస్థితులు రానున్న రోజుల్లో మరీ దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. అయినా సరే మారడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో క్రమంగా పరిస్థితులు దిగజారే అవకాశాలు కనపడుతున్నా జనాలకు మాత్రం లెక్క లేదు అనే విషయం అర్ధమవుతుంది. మరి ఎప్పటికి అర్ధమవుతుందో ఏమో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: