మహా జాబిలి 2020వ సంవత్సరంలో ఏప్రిల్ 7వ తేదీన మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో దర్శనమివ్వబోతుంది. పౌర్ణమి రోజు మనం నిండు చంద్రుడిని చూస్తూ ఉంటాము. ఒక్కో సమయంలో ఆ జాబిలి కొంచెం పెద్ద సైజులో కనిపిస్తుంది. ఈ సారి జాబిలి పెద్ద సైజులో కనపడటమే కాకుండా కొన్ని వింతలు విశేషాలను కూడా తీసుకొస్తుంది.

 

అయితే చైత్ర పూర్ణిమ చంద్రుడు మాహా జాబిలిగా మారబోతుంది. అంతేకాదు ఇతర గ్రహ సంచారాలను కుడా పరిశీలిస్తే ఈ పూర్ణ చంద్రుడు కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు చూపనున్నాడు. మంగళవారం రాత్రి మహా జాబిలిని దర్శించుకుని ద్వాదశ రాశుల వారు జాతక లోపాల దృష్ట్యా పరిహారార్ధం దైవ స్మరణ చేస్తూ లలితా సహస్ర నామం, విష్ణు సహస్ర నామం చదుకున్న వారికి శుభం కలుగుతుందన్నారు.

 

అయితే ఆరు విడుతల కాలసర్పయోగంలో కూడా చంద్రుడు తనకు అత్యంత ఇష్టమైన నక్షత్రం రోహిణి నక్షత్రంలో ఉచ్చస్థితి కలిగి ఉండడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం పాప గ్రహ సంఘర్షణలు అధికంగా ఉన్నాయన్నారు. గతంలో 2019 డిసెంబర్ 26 తేదీ నాడు ఏర్పడిన షష్ఠ గ్రహ కూటమిలో గురు ,శని ,కేతు ,బుధ , రవి ,చంద్ర గ్రహాలు ధనస్సురాశిలో కలిసిన నాటి నుండి మొదలై ప్రస్తుత ఈ స్థితి వలన అరిష్టయోగం ఏర్పడినది. ఈ ప్రభావ ఫలితంగా ఈ శార్వరి నామ సంవత్సరాన్ని కుదిపి వేస్తుంది.

 

అయితే ప్రస్తుత కాలంలో ప్రపంచమంతటా కరోనా వ్యాధి విజృంభిస్తుంది. అందుకు ప్రజలు అధికారులు చెప్పే నియమాలను పాటించడం వలన ఈ వ్యాధిని కొంత వరకు అరికట్టవచ్చునన్నారు. ఇంకా వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: