టాలీవుడ్ లో అనసూయకు పోటీ రెడీ అవుతుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అనసూయకు ఈ మధ్య డిమాండ్ కాస్త పెరుగుతుంది. ఆమెకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. కీలక పాత్రల కోసం ఆమెను ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆమెకు ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీ లేదు. సుమా ఆమె కంటే ముందు ఉన్నా సుమా జోనర్ వేరు. ఆమె అనసూయ చేసే కార్యక్రమాలను చేసే అవకాశం ఉండదు. 

 

దీనితో అనసూయకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని ఇప్పుడు యాంకర్ మంజూష నుంచి ఎక్కువగా అనసూయకు పోటీ వస్తుందని ఆమెను నిర్మాతలు ఎక్కువగా సంప్రదించే కార్యక్రమాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పలు టీవీ షోస్ కూడా ఆమె చేస్తుంది. మరిన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఆమె పెట్టే ఫోటో లు హాట్ టాపిక్ గా ఉన్నాయ్. మరింత హాట్ గా ఫోటోలను ఆమె పోస్ట్ చేస్తుంది. 

 

 

పలు టీవీ షోస్ కి ఇప్పుడు మంజూష ని సంప్రదిస్తున్నారు. అనసూయ రేట్ ఎక్కువగా ఉండటం ఆమె అంతగా డిమాండ్ చేయకపోవడం తో నిర్మాతలు ఎక్కువగా ఆమెను సంప్రదిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అనసూయ చేసే కార్యక్రమాలు అన్ని కూడా ఇప్పుడు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈమె చేసే కార్యక్రమాలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా యూత్ ని టార్గెట్ చేస్తుంది మంజూష అని అంటున్నారు. మరి పోటీ వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: