దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ ఇప్పుడు దేశం లో చాలా అవసరం అనేది ప్రజల అభిప్రాయం. లాక్ డౌన్ లేకపోతే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అంటూ నిపుణులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. కేంద్రం కూడా ఇప్పుడు దీనిపైనే ఆలోచనలు చేస్తుంది. 

 

ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాల నేతలతో చర్చలు కూడా జరిపారు. వాళ్ళు కూడా లాక్ డౌన్ ని కొనసాగించాలి అనే సూచనే మోడికి చేసినట్టు సమాచారం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విషయాన్ని ప్రధాని ముందు ఉంచాలని భావిస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దులను మూసి వేయడం మంచిది అనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా సరే దేశం తట్టుకుని నిలబడటం అనేది చాలా కష్టం అంటున్నారు. 

 

దేశంలో కరోనా ఇప్పుడు అదుపులో ఉందీ అనుకున్నా సరే అది అంతగా అదుపులో ఉండే అవకాశాలు కనపడటం లేదు. తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో దారుణంగా కరోనా వైరస్ ఉంది అనే విషయం అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడం ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి జిల్లాల సరిహద్దులను అనుమతించినా రాష్ట్రాల సరిహద్దులను అనుమతించినా సరే తేడా వస్తుంది. కాబట్టి ఒకటికి వంద సార్లు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి అని సూచనలు చేస్తున్నారు. ఏ విధంగా ఆలోచిస్తుందో అర్ధం కావడం లేదు కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: