చిన్న దేశాలు ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా భయం తో బ్రతికే పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కావడం లేదు. ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బ 209 దేశాలకు తగిలింది. ఇందులో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం కలిపితే ఇక 20 ఉంటాయి ఏమో. మిగిలిన దేశాల్లో వైద్య సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి అనే విషయం అర్ధమవుతుంది. 

 

అభివృద్ధి చెందిన దేశాలకు దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. వందల సంఖ్యలో ప్రజలు రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది ప్రతీ రోజు కూడా కరోనా బారిన పడుతున్నారు. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాక చిన్న దేశాలు ఇప్పుడు భయపడుతున్నాయి. వైద్య సదుపాయాలు లేవు మందుల కొరత చాలా తీవ్రంగా ఉంది. అలాగే వైద్యులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఆయా దేశాల్లో. 

 

కరోనా కట్టడికి మన దేశం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని ఆ దేశాలు కూడా కఠినం గా అమలు చెయ్యాలని ఒక అంచనాకు వచ్చాయి. ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆ దేశాలు అన్నీ కూడా పట్టుదలగా ఉన్నాయి. కరోనా వైరస్ ని ఎదుర్కోవాలి అంటే అగ్ర రాజ్యాల సహకారం కోరాలని భావిస్తున్నాయి. ఇప్పుడు ఆర్ధికంగా బలహీనంగా ఉన్న దేశాలు దీన్ని ఎదుర్కోవడానికి సరికొత్త మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి. మన దేశం కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఆర్ధికంగా ఇప్పటికే చాలా దేశాలు నష్టాల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: