దేశ వ్యాప్తంగా ఇప్పుడు కఠిన నిర్ణయాలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారి నుంచి భారీగా కేసులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కేంద్రం కూడా ఇప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. 

 

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బలగాలను దింపే ఆలోచనలో కేంద్రం ఉంది. దేశంలో కేసులు పెరిగితే మాత్రం పరిస్థితిని కట్టడి చేయలేని విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం నష్టాలు ఉంటాయని అంటున్నారు. దాదాపు 12 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది అంటున్నారు. కేంద్రం ఇక కీలక నిర్ణయాలు తీసుకుని, 

 

ఆర్ధికంగా నష్టాలు రాకుండా వ్యవహరించి... ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుని అవసరమైతే లాక్ డౌన్ ని పోడిగించాలి అని పలు రాష్ట్రాలు సూచనలు చేస్తున్నాయి. ప్రతీ రాష్ట్రంలో కూడా కరోనా ప్రభావం ఉంది. చాలా వరకు రాష్ట్రాలు కరోనా వైరస్ ప్రభావం తో చాలా వరకు నష్టాల్లోనే ఉన్నాయి. దేశం చాలా వరకు ఇప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. వేల కోట్ల రూపాయల ఆదాయం పోతుంది. రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళే ఆదాయం కూడా దాదాపుగా ఆగిపోయింది అనే చెప్పాలి. మరి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: