క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.  ఇప్ప‌టికే ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి 209 దేశాల‌కు  విస్త‌రించింది.  రోజు రోజుకూ ఆయా దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 13 ల‌క్ష‌ల 47 వేల 803 మందికి ఈ వైర‌స్ సోకింది. దీని బారినప‌డి 74, 807 మందికిపైగా మ‌రణించారు. 2 ల‌క్ష‌ల 77 వేల 402 మంది చికిత్స పొంది కోలుకున్నారు. ఒక్క యూర‌ప్‌లోనే 50 వేల 135 మంది మృత్యువాత‌ప‌డ‌టం గ‌మ‌నార్హం. సామాన్య ప్ర‌జ‌ల నుంచి దేశాధినేత‌ల వ‌ర కూ ఈ వైర‌స్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు.  బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్ (55) క‌రోనా  బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుత‌న్నారు.  ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆదివారం లండన్ ఆసుపత్రిలో చేరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: