భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 4500 క్రాస్ అయ్యి 5 వేల‌కు చేరువ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వ‌ర‌ల్డ్ మీట‌ర్ ప్ర‌కారం చూసినా మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందారు. మ‌న ప‌రిస్థితి ఇలా ఉంటే మ‌న దేశాన్ని ఇప్ప‌టికే 30 దేశాలు సైతం సాయం కోరుతున్నాయి. చివ‌ర‌కు అగ్ర రాజ్యం అయిన అమెరికా సైతం మ‌నల‌ను అనేక రూపాల్లో సాయం చేయాల‌ని కోరుతుండ‌డం విశేషం.



కోవిడ్ వైర‌స్ తీవ్ర‌త నేప‌థ్యంలో భారతదేశం మొత్తం 2020 ఏప్రిల్ 14 వరకు 21 రోజులు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి చాలా వరకు దిగజారిపోయింది. అంతే కాకుండా కరోనాకి వ్యతిరేఖంగా పోరాడుతున్న భారత ప్రభుత్వానికి మద్దతుగా చాలా మంది పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు.. సినీ ప్ర‌ముఖులు స్వ‌చ్ఛందంగా స్పందిస్తూ విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు ఆటో పరిశ్రమలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాయి.



ఈ నేపథ్యంలో ఎంవి అగుస్టా కంపెనీ కరోనా టెస్టింగ్ కోసం పిసిఆర్ మిషన్స్ డొనేట్ చేసింది. ఇటాలియన్ మోటారుసైకిల్ బ్రాండ్ అయిన ఎంవి అగుస్టా కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో భాగంగా త‌మ వంతుగా కోవిడ్ ప‌రీక్ష‌ల కోసం ఈ పరీక్ష యంత్రాలను విరాళంగా ఇచ్చింది. ఎంవి అగుస్టా ప్రకారం సంస్థ కేవలం 30 నిమిషాల్లో ప్రాసెస్ చేయగల అధునాతన పరీక్ష యంత్రాలను విరాళంగా ఇచ్చింది. ఇది క‌రోనా బాధితుల‌ను వేగంగా గుర్తించ‌డంతో పాటు రిమోట్‌గా కూడా ప‌నిచేస్తుంది.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :




NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: