ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు భారత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు దేశం అంత‌టా లాక్ డౌన్ అమ‌ల్లో ఉంది. ముందుగా మోదీ చెప్పిన ప్ర‌కారం లాక్‌డౌన్ మ‌రో వారం రోజుల్లో ముగియ‌నుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్ర‌త నేప‌థ్యంలో ఈ లాక్‌డౌన్ షెడ్యూల్ మ‌రింత పొడిగించాల‌ని చాలా మంది నిర్ణ‌యిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం అవ‌స‌ర‌మైతే మ‌రో నెల రోజుల పాటు అయినా ఈ లాక్ డౌన్ పొడిగించ‌క త‌ప్ప‌ని ప‌రిస్ధితులు ఏర్ప‌డుతున్నాయ‌న్నారు.

 


లాక్ డౌన్ పొడిగింపు విష‌యాన్ని తానే స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి చెప్పాన‌ని కూడా అన్నారు. తెలంగాణ‌తో పాటు మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు లాంటి రాష్ట్రాల్లో కేసులు స్వైర‌విహారం చేస్తుండ‌డంతో లాక్ డౌన్ పొడిగించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులే ప్ర‌స్తుతం ఉన్నాయి. ఇక మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక‌రే సైతం లాక్‌డౌన్ పొడిగించాల్సిందే అని ప్ర‌క‌ట‌న చేశారు. అయితే మేఘాల‌యా రాష్ట్రం మాత్రం తాము 15వ తేదీన లాక్‌డౌన్‌ను ఎత్తేయబోతున్నట్లు ప్రకటించింది.


అక్క‌డ ఈ నెల 15వ తేదీ నుంచి సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డేందుకు కావాల్సిన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు మినహా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెంద‌కుండా జ‌న‌జీవ‌నానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌ట‌న చేసింది. లాక్‌డౌన్ మ‌రింత కాలం కొన‌సాగితే వ‌చ్చే ఇబ్బందుల నేప‌థ్యంలో తాము దీనిని పొడిగించాల‌నుకోవడం లేద‌ని ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని మేఘాలయా ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సాంగ్ తెలిపారు.
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :




NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: