ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు 205 దేశాలకు విస్తరించింది.  కొన్ని దేశాల్లో అయితే జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి మహమ్మారి ఎన్నో దేశాల్లో మరణ మృదంగం వాయిస్తుంది.  12,86,664 మంది వైరస్ బారిన పడ్డారు.  కాగా, ఇప్పటి వరకు 70,446 మంది మరణించారు.  రోజు రోజుకు మరణాల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నది.  యూరప్ దేశాల్లో ఈ వైరస్ వలన 50వేల వరకు మరణాలు సంభవించాయి.  అమెరికాలో రోజు రోజుకు వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  

 

కాకపోతే చైనాలో కరోనా మరణం లేని రోజు నమోదైంది. వుహాన్‌లో కరోనా మహమ్మారి పుట్టిన తర్వాత చైనాలో కరోనా మరణాలు లేని రోజు లేదు. వుహాన్‌లోనే మూడువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా తీవ్రత ఎక్కువ ఉండి ప్రతి రోజూ ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. అయితే తొలిసారిగా కరోనా మరణాలు లేని రోజు నమోదు కావడంతో చైనా వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.  

 

వుహాన్‌లో ఇప్పటికే ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించింది. ఆ దేశంలో మొత్తం 81,740 మంది ప్రజలకు కరోనా సోకగా 3,331 మంది ప్రాణాలు కోల్పోయారు. వుహాన్‌లోనే బాధితులు అధికంగా ఉన్నారు. యూరప్‌, అమెరికాలో కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈసారి కరోనా వ్యాధి లక్షణాలు లేకున్నా టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: