ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు గ‌త 24 గంట‌ల్లో కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయ‌నే చెప్పాలి. గ‌త మూడు నాలుగు రోజులుగా మ‌ర్క‌జ్ కేసుల నేప‌థ్యంలో క‌రోనా కేసులు పెరిగినా గ‌త 24 గంట‌ల్లో మాత్రం త‌గ్గాయి. ఒక్క గుంటూరు జిల్లాలో మాత్ర‌మే క‌రోనా కేసు న‌మోదు అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే క‌రోనా పాజిటివ్ కేసులు 304కు చేరుకున్నాయి. అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో 74 కేసులు న‌మోదు కాగా... నెల్లూరు జిల్లాలో 42 కేసులు న‌మోదు అయ్యాయి.

 


గ‌త 24 గంట‌ల్లో ఒక్క కేసు మాత్ర‌మే న‌మోదు కావ‌డాన్ని బ‌ట్టి చూస్తే కేసుల ఉధృతి అయితే త‌గ్గింద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే మంగ‌ళ‌వారం ఏపీలో మ‌రో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి (45) కరోనాతో బాధపడుతూ ఇవాళ మృతి చెందాడు. దీంతో కరోనా మృతుల సంఖ్య రాష్ట్రంలో నాలుగుకు చేరింది. ఇక ఈ మ‌ర‌ణాల్లో అనంత‌పురం, క‌ర్నూలు, వైజాగ్‌కు చెందిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురు బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: