ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రెండే పేర్లు వినిపిస్తున్నాయి...ఒకటి కరోనా వైరస్.. రెండోది హైడ్రాక్సీక్లోరోక్వీన్. మలేరియాను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌కు ఇప్పుడు ఎక్కడ లేని డిమాండ్‌ పెరిగిపోయింది. నిజంగానే ఇది కోవిడ్ 19కు మందుగా పనిచేస్తుందా..? అమెరికా సహా కొన్ని దేశాలు ఈ మందు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాయి. కరోనాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ సరైనా మందా.. అదే నిజమైతే మరి ఎందుకు ఇన్ని మరణాలు...?

 

కరోనాపై పోరాటంలో హైడ్రాక్సీక్లోరోక్వీన్ గేమ్ చేంజర్‌గా మారబోతోంది... కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతి ప్రెస్ బ్రీఫింగ్‌లో చెబుతున్న మాటలివి. హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందును వాడితే కరోనా వైరస్ నయమైపోతుందని ట్రంప్ నమ్ముతున్నారు. అందుకే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. పైగా ఆ డ్రగ్ అందుబాటులో ఉన్న దేశాల పై ఒత్తిడి కూడా చేస్తున్నారు. తక్షణం నిషేధాన్ని ఎత్తివేసి..మా దేశానికి యాంటీ మలేరియా డ్రగ్స్ పంపాలని భారత్‌ను కోరారు ట్రంప్..కోరడం వరకు ఓకే ...కానీ ట్రంప్ అంతటితో ఆగకుండా... పంపుతారా లేకపోతే మా ప్రతాపం చూపాలా అంటూ హెచ్చరికలు కూడా చేశారు... హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔషధం కోసం ట్రంప్ ఎందుకింత తాపత్రయపడుతున్నారు...? 


ప్రస్తుతానికి కోవిడ్ 19కు చికిత్సకు  ఎలాంటి మందులు గానీ, టీకాలు గానీ, ఔషధాలు కూడా అందుబాటులో లేవు. కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ను ఎదుర్కోవాలంటే దానికి మందులు తయారు చేయాలన్నా... వాక్సిన్‌ సిద్ధం చేయాలన్నా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. కానీ అప్పటి వరకు ఎలాంటి మందులు వాడకుండా ఉండలేరు కదా.... 
హైడ్రాక్సీ క్లోరోక్విన్ అన్నది క్లోరోక్విన్ మందుల్లో అడ్వాన్స్‌డ్‌ మెడిసిన్ అని చెప్పవచ్చు. మలేరియా వ్యాధిని తగ్గించడానికి 
క్లోరోక్వీన్ బాగా ఉపయోగపడుతుంది. మలేరియాతో బాధపడుతున్న వారికి హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందుల ఇస్తే రెండు మూడు రోజుల్లోనే ఫలితాలు ఉంటాయి. అందుకే దీనిని యాంటీ మలేరియా  డ్రగ్‌గా పిలుస్తారు. యాంటీ వైరల్ ఏజెంట్‌గా కొన్ని దశాబ్దాలుగా ఈ క్లోరోక్వీన్ ను ఉపయోగిస్తున్నారు. కేవలం మలేరియాకే కాకుండా మరికొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు.

 

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ దివ్యౌషధంగా పనిచేస్తుందని చాలా దేశాలు నమ్ముతున్నాయి. వాటిలో అమెరికా కూడా ఉంది. అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనాను పూర్తిగా నయం చేస్తుందని ప్రపంచంలో ఎక్కడా నిరూపితం కాలేదు. ఇంకా ఇది క్లినికల్ ట్రయల్స్‌ దశలోనే ఉంది... శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కరోనా వైరస్‌కు మందని ఎక్కడా ప్రకటించలేదు. కరోనా వైరస్ విషయంలో  
ట్రంప్‌కు సలహాలు సూచనలు ఇస్తున్న టాస్క్‌ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫాసీ కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను నిర్దారించలేదు. 
సైన్స్ ప్రకారం  ఈ మందును కోవిడ్ 19కు వాడొచ్చా అని ప్రశ్నిస్తే...వాడలేం అనేదే ఆయన సమాధానం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: