క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి ఎంత‌లా విజృభిస్తుందంటే... ఎన్న‌డూ లేనంత‌గా ప్ర‌పంచంలోని మూగ‌జీవాలు కూడా రోడ్ల ప‌య‌న తిర‌గాలంటే భ‌య‌మేస్తున్నంత‌గా. ఎంతో అవ‌స‌ర‌మైతే త‌ప్పించి బ‌య‌ట‌కు రాకూడ‌ని ప‌రిస్థితులు గ‌త నెల‌రోజుల నుంచి ప్ర‌పంచంలో నెల‌కొన్నాయి. ఏమాత్రం అప్ర‌మ‌త్తంగా ఉన్నా స‌రే ఈ వ్యాధి సోకే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక దిక్కుతోచ‌ని స్థితిలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా లాక్‌డ‌వున్‌ని ప్ర‌క‌టించాయి. దాంతో ఎక్క‌డి వారు అక్క‌డే ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొనింది. ఎవ‌రికి వారు స్వియ‌నిర్బంధ‌న‌లో ఉండిపోయారు. ఎంత అవ‌స‌ర‌మైన ప‌నైనా స‌రే ఒక ఊరి నుంచి మ‌రో ఊరికి వెళ్ళే ప‌రిస్థితులు అస‌లు లేవ‌ని చెప్పాలి.

 

మ‌రి ఇలాంటి సంద‌ర్భాల్లో ఎవ‌ర‌న్నా చ‌నిపోయినా స‌రే చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌నే చెప్పాలి. చ‌నిపోయిన వారిని ఆఖ‌రి చూపులు కూడా చూడ‌టానికి లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అయితే కొంత మంది వాటిని కూడా త‌ట్టుకోలేక ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో డిప్ర‌ష‌న్‌కి లోన‌యి అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇలాంటి విచార‌క‌ర‌మైన ఘ‌ట‌నే ఒక‌టి అనంత‌పురం జిల్లాల‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే...

 

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం, పుట్లూరు మండలం తక్కెళ్లపల్లికి చెందిన నారాయణ రెడ్డి  తీవ్ర‌ అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నాడు. అనుకోకుండా అత‌ను త‌న స్వగ్రామంలో మూడు రోజుల కిందట మృతిచెందాడు. తండ్రితో మనస్పర్థల కారణంగా ఆయన కుమారుడు హనుమంత రెడ్డి(25) గతేడాది నుంచి తండ్రికి దూరంగా ఉంటున్నాడు. నారాయ‌ణ‌రెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురంలో బట్టల వ్యాపారం చేస్తూ జీవ‌నం సాగిస్తూ ఉండేవాడు.

 

ఈ క్రమంలో తండ్రి అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిన వెంట‌నే చుట్టుప్ర‌క్క‌ల వారు కొడుకుకి ఫోన్ చేసి చెప్పారు.  కొడుకు లాక్‌డౌన్ కారణంగా సకాలంలో ఊరికి వెళ్లలేకపోయాడు. దీంతో ఐదేళ్ల కిందటే హనుమంతరెడ్డి తల్లి చనిపోయింది. ఇప్పుడు తండ్రి కూడా మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన హ‌నుమంత‌రెడ్డి డిప్ర‌ష‌న్‌కి లోన‌యి చివరికి తండ్రికి అంత్యక్రియలు కూడా చేయలేకపోయానన్న బాధతో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దాంతో మార్కాపురంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న అక్క‌డంతా స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: