దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఓ వైపు సీరియస్ గా లాక్ డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నా.. కొంత మంది నిర్లక్ష్య దోరణి వల్ల  కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రోజుల్లో కేసుల సంఖ్యం మరింత పెరిగిపోతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వారి ద్వారా సంక్రమిస్తున్న విషయం తెలిసిందే.  వీరిలో కొంత మంది రహస్య సమావేశాలు ఏర్పటు చేయడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరిస్తూ వస్తుంది.

 

 ఈ నేపథ్యంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  తెలంగాణలో పెరుగుతోంది. ఈ విషయాన్ని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించి చెప్పారు.  అయితే  ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి క్యారంటైన్ లో ఉండాలని.. తగిన రీతిలో ట్రీట్ మెంట్ చేయించుకోవాలని చెబుతూనే ఉన్నారు.  తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. వీళ్లందరూ మర్కజ్ వెళ్లొచ్చిన వారే.

 

గద్వాల టౌన్ లో 7, రాజోలు మండల కేంద్రంలో మరో 2 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఈ జిల్లాలో మొత్తం 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సంబంధిత అధికారుల సమాచారం.  ఈ విషయం తెలుసుకున్న జిల్లా ప్రజానికం ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఇంకా ఎన్ని కేసులు నమోదు అవుతాయో అని భయంతో వణికిపోతున్నారు. 

 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: