1920 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ తేదీన పండిట్ రవిశంకర్ ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ లో జన్మించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చిన రవిశంకర్ సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈరోజు పండిట్ రవిశంకర్ నూరవ జయంతి. హిందుస్తానీ సితార్ విద్వాంసుడిగా గుర్తింపు పొందిన రవిశంకర్ ఆలిండియా రేడియోలో మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. విదేశాల్లో ఈయన ఎన్నో కచేరీలు ఇచ్చారు. 
 
1938 లో నృత్యాన్ని పక్కనబెట్టి సితార్‌ నేర్చుకోవడానికి అల్లాద్దిన్‌ ఖాన్‌ అనే విద్వాంసుడి వద్ద చేరాడు. 1944 లో చదువు అనంతరం మ్యూజిక్‌ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించి సత్యజిత్‌రే 'అప్పు' చిత్రానికి పనిచేశారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రవిశంకర్ మొదటి భార్య ముస్లిం కావడం గమనార్హం . ఆ తరువాత ఆమె అన్నపూర్ణాదేవిగా పేరును మార్చుకున్నారు. సంగీత రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి మన దేశం రవి శంకర్ కు భారత రత్న ఇచ్చి సత్కరించింది. 2012లో కాలిఫోర్నియాలో రవి శంకర్ తుది శ్వాస విడిచారు. సంగీతంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన రవిశంకర్ ను అభిమానించే ఎంతోమంది సంగీత ప్రియులు నేటికీ ఉన్నారు. 
 
ప్రస్తుతం రవి శంకర్ భార్య సుకన్య, కూతురు అనుష్క లండన్ లో ఉన్నారు. కరోనా కారణంగా వారు రవిశంకర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నా పరిస్థితుల దృష్ట్యా ఇంటికే పరిమితమయ్యారు. రవిశంకర్ జీవితంలో అన్నపూర్ణాదేవి మాత్రమే కాకుండా సన్నిహిత, సూజోన్స్ , సుకన్య ఉన్నారు. సుకన్య , రవిశంకర్ ల వివాహం 1989లో హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ లో జరిగింది. 
 
రవిశంకర్‌ హిందుస్థాని క్లాసికల్‌ సంగీతంలో పలు అవార్డులతో పాటు మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు 1975లో యునెస్కో సంగీత పురస్కారం 1981 లో పద్మవిభూషణ్‌ పురస్కారం 1988 లో కాళిదాస్‌ సమ్మాన్‌ పురస్కారం 1992 లో రామన్‌ మెగసేసే పురస్కారం తో రవిశంకర్ ను సత్కరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: