తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ఒక్కరోజే 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు కరోనాతో మృతి చెందారు. ఈరోజు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 23 రోజుల పసికందు ఉండటం గమనార్హం. 23 రోజుల పసికందుకు కరోనా సోకినట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. కేవలం మహబూబ్ నగర్ జిల్లాలోనే 
కరోనా కేసుల సంఖ్య 23కు చేరింది. 
 
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో ఈ పాపే అతి పిన్న వయస్కురాలు. ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి ద్వారా పాపకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నారు. 
 
నిన్న 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు నమోదైన కేసులను వైద్య, ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రాష్ట్రంలో నిన్నటివరకూ 364 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాత్రికి ఆ సంఖ్య 400 దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు భారీ సంఖ్యలో హాజరైన వారి వల్లే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. 
 
మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అధికారులు రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన 25 హాట్ స్పాట్లను గురించారు. మరికొన్ని ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు. హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలలో ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ పరీక్షలు జరిపి కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది.       

మరింత సమాచారం తెలుసుకోండి: