దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశంలో కేసుల సంఖ్య అనేది క్రమంగా తగ్గు ముఖం పడుతున్నట్టే కనపడుతుంది. మూడు రోజుల క్రితం దేశంలో 24 గంటల్లో 600 కి పైగా కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ కేసుల సంఖ్య 300 లోపు పడింది. ఇది లాక్ డౌన్ పుణ్యమే అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. లాక్ డౌన్ ని అమలు చేయడం తోనే కేసులు తగ్గుతున్నాయి. 

 

ఇక కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా తగ్గుతున్నాయి. వందల కొద్దీ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ఇప్పుడు పదుల సంఖ్యలో పడిపోయే పరిస్థితి నెలకొంది. చాలా వరకు రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నాయి. అదే విధంగా మరణాల సంఖ్య కూడా తగ్గుతూనే ఉంది. ఊహించని విధంగా మరణాలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు మాత్రం తగ్గుతున్నాయి. లాక్ డౌన్ ని అన్ని రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా అమలు చేస్తున్నాయి. 

 

క్వారంటైన్ సెంటర్లలో ఉండే వాళ్ళు కూడా క్రమంగా బయటకు వస్తున్నారు. చాలా మందికి నెగటివ్ వస్తుంది. వేల మంది ఉన్నా సరే పదుల సంఖ్యలోనే ఇప్పుడు కేసులు ఉంటున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన లెక్కల ప్రకారం కేసులు తగ్గుతున్నాయి. 300 ల లోపే కేసులు ఉన్నాయి. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు మంచి పరిణామం. ఇంకొన్ని రోజులు లాక్ డౌన్ ఉంటే మాత్రం కేసులు ఇంకా తగ్గడం ఖాయమని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి మన దేశంలో ఇబ్బంది లేదని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: