ఏపీ ప్రబలుతున్న కరోనా మహమ్మారి వ్యవహారం.. జగన్ కు అన్నప్రాసన రోజే ఆవకాయ మాదిరిగా తయారైందనే చెప్పాలి. జగన్ జనం మెచ్చిన నాయకుడే. అందులో తిరుగులేదు. ఎంత ప్రజాదరణ లేకపోతే.. 175 సీట్లుకు జనం 151 సీట్లు గంపగుత్తగా కట్టబెడతారు. అయితే అంతటి ప్రజాదరణ ఉన్నా.. పాలనానుభవం మాత్రం లేదు. అయితే పాలనకు అనుభవం అవసరమా అన్న చర్చ కూడా ఉంది.

 

 

జనానికి మేలు చేయాలి అన్న తపన ఉండాలే కానీ.. అనుభవం ముఖ్యంకాదని కొందరు వాదిస్తారు. మంచి అనుభవం ఉన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సలహాదారుల అండతో బ్రహ్మాండంగా పాలన సాగించొచ్చు.. అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. కానీ అది ఎప్పుడు.. పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు. కానీ ఏకంగా కరోనా మహమ్మారి వంటి కనీ వినీ ఎరుగుని విపత్తును ఎదుర్కొనే సమయంలో అనుభవం అన్నది కచ్చితంగా ఓ అదనపు అర్హత అవుతుంది.

 

 

మహా మహా తలలు పండిన నాయకులు, పాలనలో అనుభవం ఉన్నవారే ఈ కరోనా మహమ్మారి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా అని తలలుబద్దలు కొట్టు కుంటున్నారు. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రి అయి ఏడాది కూడా పూర్తి కాకుండానే ఇంకా పాలనపై పూర్తి పట్టు రాకుండానే జగన్ కు కరోనా రూపంలో అగ్ని పరీక్ష ఎదురైంది. దీనికి తోడు ఈ కరోనా వచ్చిన టైమింగ్ కూడా జగన్ ను భలే చిరాకు పెట్టించేసింది.

 

 

సాధారణంగా కరోనా మామూలు సమయంలో వస్తే ఎలా ఉండేదో ఏమో కానీ.. జగన్ మాంచి కసిగా స్థానిక సంస్థల్లో గెలుపు కోసం స్కెచ్ గీసిన వేళ.. అందులోనూ కొన్ని చోట్ల పోలింగ్ కూడా పూర్తయిన సమయంలో అనుకోని అతిథిలా వచ్చిన కరోనా జగన్ ను మహా చిరాకు పెట్టేసింది. అన్యమనస్కంగానే కరోనాపై పోరు ప్రారంభించిన జగన్ ఆ తర్వాత కాస్త కుదుటపడి రంగంలోకి దిగారు. కరోనా కట్టడిలో మంచి మార్కులే సంపాదిస్తున్నారు. అయితే చేసిన పనికి చక్కని ప్రచారం మాత్రం లభించలేదనే చెప్పాలి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: