దేశంలో ఇప్పుడు కరోనా బూచీ ఎంతగా భయపెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కరోనాని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ఉన్న సమయంలో కేవలం డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు మాత్రమే తమ సేవలు కొనసాగిస్తున్నారు.  అయితే ఇప్పటికే దేశ వ్యాప్తంగా డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికుల సేవలకు ఉప్పొంగిపోతూ వారికి సంఘీభావం పలుకుతున్నారు పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు. 

 

నిన్న తెలంగాణ సీఎం పారిశుద్ద్య కార్మికులను ఇప్పుడు నెత్తిన పెట్టుకోవాలని.. వారి సేవలు ప్రశంసనీయం అని సపాయన్నా.. నీకు సలాం అన్నారు.  మరి కొన్ని చోట్ల పారశుద్ధ్య కార్మికుల మెడలో కరెన్సీ నోట్ల హారాలు వేసి.. శాలువాలు కప్పి సన్మానించిన పలమనేరువాసుల తీరు దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఇలా ఈ దేశంలో ఎప్పుడూ.. ఎక్కడా జరగలేదు. పలమనేరు పట్టణం, పెద్ద మసీదులోని ముగ్గురికి కరోనా వ్యాధి సోకడంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా అధికారులు ప్రకటించారు.

 

అయితే అక్కడ పారిశుధ్య కార్మికులు మాత్రం తమ పని నిర్విరామంగా చేసుకుంటూ వెళ్తున్నారు.  రసాయనమందులను పిచికారి చేశారు. దీంతో తమ ఆరోగ్యం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దండం పెడుతూ.. మీ సేవలు ఎంతో గొప్పవని పొగుడుతు ఆ ప్రాంత వాసులు వీరిని ఎంతో గౌరవించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: