ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు  రోజుకు పెరుగు తూ వస్తుంది. ఎంత కట్టడి చేయాల నీ ప్రభుత్వం ఎన్ని చట్టాలను తీసుకొచ్చిన కూడా వాటి ని  తిప్పి కొడుతూ కరోనా ముందుకు వెలుతూ వస్తుంది. కంటికి కనిపించని ఈ కరొన ను పరిశుభ్రత ను పాటించి తరిమికొట్టాల ని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.  

 

 

 

ఈ మేరకు  ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఇందు లో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 


కడప జిల్లా బద్వేల్ లో ఓ వ్యక్తికి కరోనా సోకిందని అతనితో ఉన్న కుటుంబ సభ్యులు క్వారంటైన్ కు రావాలని మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.. అనంతరం జిల్లాలోని జర్నలిస్టులకు ప్రెస్ ముద్రించిన టి షర్టులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా సేవా ఆర్యక్రమాలు  చేయాలనుకునేవారు పోలీసులకు తెలిపరచాలని కోరారు.


 

 

అలాగే మీడియా ప్రతినిధులు ప్రజలకు కరోనా పై అవగాహన కలిపించాలని సూచించారు. ప్రస్తుతం నగరంలో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి.. వీటిని తగ్గించే దిశగా ప్రజలు సహకరించాలని డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అర్బన్ సీఐ రమేష్ బాబు, వైద్య అధికారి చంద్రహాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సహకారం ఉంటేనే సాధ్యమవుతుందని వెల్లడించారు.  ప్రజలు ఎట్టి పరిస్థితు లలో గుంపులు గా బయట కు రాకూడద ని సూచించారు. వైద్యుల సలహాల ను పరిశీలించాల ని పిలుపు నిచ్చారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: