మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 14 న దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పైగా, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.

 

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగుతున్న లాక్ డౌన్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగిస్తారా? లేక ఎత్తివేస్తారా? అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయంతో పాటే రాష్ట్రం కూడా నడవనుంది. 


అయితే ఏపీలో ఇంకా ఎవరికైనా కరోనా సోకిందేమోనన్న అనుమానాలతో ర్యాండమ్ టెస్టులకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ లెక్కలు మూడు నాలుగు రోజుల్లో తేలిపోనున్నాయి. ఆ తరువాత రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ విధంగా ఉన్నది అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. అప్పుడు పరిస్థితులని బట్టి సీఎం జగన్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవచ్చు. కాకపోతే లాక్ డౌన్ అన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చని వాదన కూడా వినిపిస్తుంది. 

 

కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విషయంలో సడలింపు ఉండొచ్చని తెలుస్తోంది. ,ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో లాక్ డౌన్ ఉండకపోవచ్చని సమాచారం. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఏప్రిల్ 14 లోపు ఏదైనా మార్పు జరిగితే, అప్పుడు మళ్ళీపరిస్థితులని అంచనా వేసి, లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఎక్కువ శాతమే అయితే ఈ రెండు జిల్లాల్లో లాక్ డౌన్ కొనసాగింపు ఉండకపోవచ్చని ప్రచారం మాత్రం జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: