ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, ఎంపీలు, మంత్రులు, సామాన్య ప్రజలు తమవంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి పీఎం కేర్ ఫండ్స్ కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.  ఆయన పిలుపుతో బీజేపీ నేతలు, మాజీ మంత్రులు కూడా విరాళాలు అందిస్తున్నారు. ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలందరి .జీతాలలో 30 శాతం కోత ఏడాదిపాటు అమలయ్యేలా ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విరాళం అందజేశారు.

 

ఎంపీ ఫండ్స్ నుంచి రూ.కోటి, సుజనా ఫౌండేషన్ నుంచి రూ.50 లక్షల విలువ చేసే చెక్కులను విరాళం కింద మంత్రి కేటీఆర్ కు అందజేసినట్టు సుజనా చౌదరి ఓ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.  ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు 30 శాతం జీతాలు స్వచ్ఛందంగా తగ్గించుకునేందుకు అంగీకారం తెలిపారు.

 

ఈ నిధులన్నీ భారత కన్సాలిడేటెడ్ ఫండ్ కు జమ అవుతాయి. వీటిని కోవిడ్ 19 వైరస్ పై పోరాటానికి ఖర్చుచేయాలని కేబినెట్ నిర్ణయించింది. అంతే కాదు  సుజనా ఫౌండేషన్ తరపున ఏపిలోని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కోటి రూపాయల విలువైన వైద్యపరికరాల కొనుగోళ్లు, పేదలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేస్తామన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: