ప్ర‌ధానిమోదీ క‌రోనా నియంత్ర‌ణ‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారంటూ శివ‌సేన పార్టీ అధికారిక ప‌త్రిక సామ్నా ఎడిటోరియ‌ల్‌లో రాసుకొచ్చింది. చ‌ప్ప‌ట్లు కొడితేనో...దీపాలు వెలిగిస్తేనో క‌రోనా పారిపోద‌న్న విష‌యం ప్ర‌ధాని మోదీ తెలుసుకోవాలంటూ సెటైర్లు సంధించింది. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌ధాని మోదీ తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాల‌ను తుర్పారాబ‌ట్టింది. ప్ర‌ధాని మోదీ చ‌ప్ప‌ట్లు కొట్టాల‌ని..దీపాలు పెట్టాల‌ని పిలుపునిస్తే కొంత‌మంది ప్ర‌జ‌లైతే పండుగ‌నే జ‌రిపేశారు..ఇంత‌కు వాళ్ల‌ను ఏమ‌నాలి..ఇది సంబ‌రాలు చేసుకునే స‌మ‌యమా..వారికి అది కూడా తెలియ‌దా అంటూ సామ్నా ఎడిటోరియ‌ల్ మండిప‌డింది. 

 

 ప్రధానమంత్రి పిలుపుపై పౌరులు తప్పుడుగా ప్రవర్తించారని, ప్రజలకు వివరించడంలో మోదీ విఫలమయ్యారని ఎడిటోరియ‌ల్‌లో పేర్కొంది.  కృతజ్ఞతల కోసమని మోదీ పిలుపునిస్తే పండగ వాతావరణంలాగా జరిగిందని సామ్నా పేర్కొంది. ఇక జనతా కర్ఫ్యూ సహా ఇప్పటి లాక్‌డౌన్‌లో కొంత మంది ప్రజలు.. ప్రభుత్వ ఆదేశాల్ని బుట్ట దాఖలు చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సామ్నా సూచించింది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో స‌మాజాన్ని ర‌క్షించేది కేవ‌లం ప్ర‌జ‌ల క్ర‌మ‌శిక్ష‌ణ మాత్ర‌మేన‌ని అన్నారు. లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న కొంత మంది ప్ర‌జ‌లు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నార‌ని పేర్కొంది. 

 

ఇలా చేసేవారిని క‌ఠినంగా శిక్షించాల‌ని, అప్పుడే మిగ‌తా వారు చేసే దీక్ష‌కు ఫ‌లితం ఉంటుంద‌ని పేర్కొంది. మోదీని లక్ష్యంగా చేసుకుని కరోనాపై పోరాటంలో చప్పట్లు కొడితేనో, దీపాలు పెడితేనో గెలవలేమని సామ్నా ఎడిటోరియల్‌లో రాయ‌డంపై బీజేపీ శ్రేణులు మండిప‌డుతున్నారు. లాక్‌డౌన్‌ను అమ‌లు చేయ‌డంలో మిగ‌తా రాష్ట్రాల‌క‌న్నా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతోంద‌ని విమ‌ర్శించారు. త‌ప్పిదాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకే ప్ర‌ధానిమోదీపై శివ‌సేన ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సామ్నా విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ఇదిలా ఉండ‌గా మహారాష్ట్రలో ఇప్ప‌టి వ‌ర‌కు  1,018 కేసులు నమోదు అయ్యాయి. దేశం మొత్తం కేసుల్లో 3,981 యాక్టివ్ కేసులని పేర్కొన్నారు. కరోనా వల్ల 114 మంది మరణించగా, కరోనా బారిన పడి 326 మంది కోలుకున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: