కేంద్ర ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ ఎత్తివేయాలని చాలామంది కోరుతుండగా మరికొంతమంది కొనసాగించాలని సూచిస్తున్నారు. కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ అమలు లో ఉంచితే అప్పుడు పూర్తిస్థాయిలో వైరస్ అదుపులోకి వస్తుందని చాలామంది అంటున్నారు. ఇటలీ, స్పెయిన్ లాగా ఇండియా అవ్వదని ఆర్థికంగా ఎంతో నష్ట పోయిన పర్వాలేదు కానీ ప్రాణాలు మిగిలితే చాలు తర్వాత సంపాదించుకోవచ్చు అంటూ చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కచ్చితంగా మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ తీసి వేస్తున్నట్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో రైలు, బస్సు ప్రయాణాలు ఎలా మొదలవుతాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క రైల్వే రిజర్వేషన్ ఏప్రిల్ 15 నుండి మొదలు కానుందని ఇటీవల ఓ జాతీయ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఇదే టైములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బస్సు రిజర్వేషన్ ఏప్రిల్ 15 నుండి స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఏపీ రాజకీయాల వార్తలు వస్తున్నాయి. అయితే నాన్‌ ఏసీ బస్సులు మాత్రమే తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. ఏసీ బస్సుల్లో అయితే కరోనా వైరస్ బ్రతికే అవకాశం ఉందని అంటున్నారు.

 

అంతేకాకుండా 15 రోజులుగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో డ్రైవర్లు కూడా బస్సులు బయటకు తీయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏప్రిల్ 15వ తారీకు నుండి మొదలయ్యే సర్వీసులకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ లో రిజర్వేషన్లు జరుగుతున్నట్లు, భారీగా రిజర్వేషన్లు ప్రయాణికులు చేసుకున్నట్లు, దీంతో ఏపీఎస్ఆర్టీసీ కి మంచి రోజులు ముందే స్టార్ట్ అయినట్లు సమాచారం. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించినా రిజర్వేషన్‌ సొమ్మును తిరిగి ఇస్తారని నమ్ముతున్న జనం ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్తే రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో నాన్ ఏసీ అమరావతి, ఇంద్ర, సూపర్‌ డీలక్స్‌, అల్ర్టా, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: