ఈశాన్య భార‌త‌దేశంలోని మేఘాల‌య రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం త‌మ రాష్ట్రంలో లాక్‌డౌన్ పాక్షికంగా ఎత్తేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు వైర‌స్ ఉధృతి పెరుగుతోంద‌ని ప‌లు రాష్ట్రాలు ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో మేఘాల‌య ప్ర‌భుత్వం ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తోంది. వాస్త‌వానికి లాక్‌డౌన్ పొడ‌గించాల‌ని చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువ‌చ్చే ప‌నిలో ఉన్నాయి. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, తమిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోకి వైర‌స్ చొచ్చుకెళ్లింది. నిత్యం వేలాదిమందికి విస్త‌రిస్తోంది. 

 

మ‌ర్క‌జ్ ఘ‌ట‌న త‌ర్వాత అది మ‌రింత వేగ‌వంత‌మైన విష‌యం తెలిసిందే. అయితే వైర‌స్ ఉధృతి ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద గా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయినా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. అందుకే ఇక్క‌డ లాక్‌డౌన్ ఎత్తివేయాల‌న్న డిమాండ్‌ను అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం దృష్టికి రావ‌డంతో ఆ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. అయితే కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించాల్సి ఉంటుంది. కొన్ని ఆంక్ష‌ల‌తోనైనా లాక్‌డౌన్ ఎత్తివేత‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఏదేమైనా 14వ‌ర‌కు పాటించాల్సిందేన‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది.

 

కొవిడ్ 19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,421 మందికి కరోనా వైరస్‌ సోకగా, 114 మంది మరణించారు.  అయితే ఏప్రిల్ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని మేఘాలయ సర్కార్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.  పాఠశాలలను మాత్రం ఏప్రిల్ 30వ తేదీ వరకు మూసి ఉంచుతామని పేర్కొంది.  ఆరోగ్య శాఖ చేసిన సూచనలను అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్లు తెరవడానికి, రైతులు పొలాలకు వెళ్లడానికి అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రవేటు సంస్థలు మాత్రం మరికొంత కాలం మూసే ఉంటాయని తెలిపింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: