దేశ వ్యాప్తంగా కరోనాని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో అన్ని వ్యవస్థలు స్తంభించి పోయిన విషయం తెలిసిందే.  ఇక బ్యాంకు లావాదేవీలు చేసేవారు.. ఈఎం ఐలు కట్టే వారు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నలు లెవనెత్తడంతో రుణగ్రహీతలు మూడు నెలల పాటు ఈఎంఐలు చెల్లించనవసరంలేదంటూ bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. 

 

అయితే, ఈ వెసులుబాటును ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు  రుణగ్రహీతలు కోరితేనే అమలు చేస్తున్నాయి. తాజాగా ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలు దీనికి సరిగ్గా వ్యతిరేకం అని చెప్పాలి.  ఎవరైనా రుణగ్రహీత తనకు ఈ సౌకర్యం అక్కర్లేదని చెబితే మాత్రమే అతడ్ని మారటోరియం పరిధి నుంచి తప్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎవరైనా ప్రత్యేకంగా కోరితే తప్ప దీన్ని డిఫాల్ట్ గా అందరు రుణ గ్రహీతలకు వర్తింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. కొన్ని బ్యాంకులు ఈ నియమాల్ని పాటించకుండా ఈఎంఐ లు కట్ చేసుకున్న విషయం తెలిసిందే. 

 

దాంతో చాలా మంది రుణ గ్రహీతలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు వేతనాలు సరైన సమయానికి అందుకోక పోవడం.. మరోవైపు ఉన్న డబ్బు ఊడ్చుకు పోవడం పై ఆర్బీఐ మరోసారి అన్ని బ్యాంకులకు మరోసారి మారిటోరియం గురించి ఆదేశాలు జారీ చేశారు.  మారటోరియం ఎంచుకునే రుణగ్రహీతలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్టు ఎస్బిఐ బ్యాంకు గుర్తించింది. అందుకే రుణ గ్రహీతలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటీపీ తెలుసుకొని అకౌంట్‌లో ఉన్న డబ్బులు నొక్కేస్తున్నారు. అందుకే ఈఎంఐ వాయిదా వేయడానికి ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదని, ఎవరికీ ఓటీపీ చెప్పొద్దని ఎస్‌బీఐ కస్టమర్లను కోరుతోంది.  మరికొన్ని నెలల పాటు ఈ లాక్ డౌన్ పొడిగిస్తే.. మరిన్ని ఇబ్బందులు ఎదురు అవుతాయని అంటున్నారు కస్టమర్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: