భూమి మీద ఉన్న మనిషి జాతిని కాకా వికలం చేస్తున్న కరోనా వైరస్ ఈ విధంగా ప్రబలడానికి కారణం జ‌గనే కారణం అన్నట్టుగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చూస్తుంటే అందరూ ఈ విధంగానే అనుకుంటున్నారు. అసలు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన కైనా అర్థం అవుతుందా అని విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంలో ఇటువంటి సమయంలోనే చిల్లర రాజకీయ నేతలు, చిల్లర ప్రచారం చేసే పేపర్లు బయట పడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అయితే తాజాగా ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి కెసిఆర్ చెప్పిన ప్రకారం దేని కింద వస్తారో అనే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది. లాక్‌డౌన్ కారణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షనేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్  లో జ‌గ‌న్ స‌ర్కార్‌పై చేస్తున్న ఆరోపణలు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేరళలో ఇప్పటికి పది వేల మందికి పరీక్షలు చేశారని.. మన రాష్ట్రంలో ఎందరికి చేశారో చెప్పడం లేదని బాబు విమర్శించారు.

 

అంతేకాదు రెండ్రోజుల నుంచి మెడికల్‌ బులెటిన్లలో పరీక్షల విషయం చెప్పకుండా దాస్తున్నారని....మూడు రోజుల క్రితం చేసిన ఆరోప‌ణ‌లే మ‌రోసారి రిపీట్ మరోసారి చంద్రబాబు ఇటీవల రిపీట్ చేసారు. అసలు బాధ్యతాయుతంగా నడవాల్సిన ప్రతిపక్షనేత ఈ అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి. ముఖ్యంగా కేసుల విషయంలో ఏకంగా వెయ్యి శాతం పెరిగాయని అసలు పరీక్షలు జరపకుండానే చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాని చాలా మంది తప్పు పడుతున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం గుంపులు గుంపులుగా ఉండకూడదని హెచ్చరికలు చేస్తుంటే, చంద్రబాబు ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నారు అంటూ చాలామంది ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు.

 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: