కరోనా కట్టడి లో భాగంగా ఎన్నో చర్యలను తీసుకున్న కూడా కరోనా ప్రభావ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు.అంతేకాకుండా లాక్ డౌన్ కొన సాగించని ప్రజల కు కొత్త విధానాల ద్వారా ప్రజల కు అవగాహన కల్పిస్తున్నారు. భారత దేశంలో అయితే మిలటరీ బలగాలను దించారు. మరికొన్ని దేశాలలో కొత్త ప్రయోగాలను చేస్తున్నారు.. 

 

 

 

అసలు విషయాని కొస్తే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కరోనా కట్టడి లో భాగంగా రోజుకో వీడియో ను పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కరోనా మహమ్మారి ఒక ఖండాని కే పరిమితం కాకుండా ప్రపంచం లో అన్నిచోట్ల కు వ్యాపించింది. ఈ వైరస్ విలయ తాండవానికి అగ్ర రాజ్యాలు సైతం కుదేలయ్యాయి. కెన్యా వంటి చిరు దేశాలు కూడా శక్తి కి మించి పోరాడు తున్నాయి. దీని పై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తి కర వివరాలు తెలిపారు.

 

 


కెన్యాలో లాక్ డౌన్ అమలు చేయడం లో పోలీసులు విఫలమవడం తో అక్కడి ప్రభుత్వం మసాయ్ తెగవారిని కర్ఫ్యూ సేవల కు రంగంలో కి దింపు తోందని వెల్లడించారు. ఓ సింహాన్ని తన బల్లెంతో చంపలేని వాడ్ని మసాయ్ తెగలో అసలు మనిషిగానే గుర్తించరని, అలాంటి ధైర్యశాలులను కర్ఫ్యూ కోసం మోహరిస్తున్నారని తెలిపారు. వీధుల్లో ఒక్క చీమ కూడా కనిపించకుండా చేసేందుకు, పెద్ద సంఖ్యలో మసాయ్ యోధులను తీసుకురావాల్సిందిగా వారి నాయకుడ్ని కెన్యా ప్రభుత్వం ఆదేశించిందని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు.ఎంతైనా అలా చేస్తేనే కరోనా కట్టడి అవుతుందని భావించారు. ఇండియాలో కూడా ఇలా చేస్తే బాగుండునని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వస్తుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: