కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. రోజూ ప్రపంచ వ్యాప్తంగా కనీసం 5 వేల మంది వరకూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకింది. ఏవో ఒకటి అరా చిన్న దేశాలు తప్పతే.. ప్రపంచం మొత్తాన్ని ఈ వైరస్ ఆక్రమించేసింది. ఇక ఈ వైరస్ కు ఇప్పటి వరకూ మందు కూడా కనిపెట్టలేదు.

 

 

దీంతో కరోనాపై విజయం సాధించడం మనిషికి సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చైనా దేశం కరోనాను కొంత వరకూ కట్టడి చేయగలిగిందనే చెప్పాలి. చైనాలో అధికారికంగా కరోనాతో మరణాల సంఖ్య మూడు వేల చిల్లర మాత్రమే ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా మరణాల సంఖ్యను మూడువేలకు పరిమితం చేసుకుంది. కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసుల నమోదు కూడా బాగా తగ్గిపోయింది.

 

 

ఇక ఇప్పుడు ప్రపంచాన్ని ఆనందింపజేసే శుభవార్త ఏంటంటే.. చైనాలో ఈ సోమవారం కనీసం ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. చైనాలో సోమవారం ఒక్క మరణం కూడా సంభవించలేదని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. జనవరిలో అధికారిక లెక్కలు ప్రకటించడం ప్రారంభించిన నాటి నుంచి ఒక్కరు కూడా మృతి చెందకపోవడం ఇదే మొదటి సారి కావడం విశేష।ం. విదేశాల నుంచి వస్తున్న బాధితుల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతోంది.

 

 

సోమవారం మరో 38 మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం చైనాలో కరోనా రోగుల సంఖ్య 80 వేలు ఉండగా.. మృతుల సంఖ్య 3,331గా ఉంది. కరోనా విషయంలో చైనా పదే పదే అబద్దం చెబుతుందన్నవాదనలు ఉన్నా.. ఒక్క కేసు కూడా నమోదు కాని విషయం మాత్రం ప్రపంచానికి ఆశారేఖగానే కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: