అదో తెలుగు దిన పత్రిక.. దమ్మున్న పత్రికగా చెప్పుకోవడమే కానీ.. అది దమ్ము కాదు చంద్రబాబుపై పక్షపాతం అంటారా ఆ పత్రికను విమర్శించే వాళ్లు. వార్త ఏదైనా.. సందర్భం ఏదైనా ఆ పత్రికకు చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యంగా ఉంటాయన్న విమర్శ ఉంది. గతంలో అయితే ఇది ఇప్పటిది కాదు. దశాబ్దాల తరబడి వస్తున్న ఆనవాయితీ.. చంద్రప్రేమ ఆ పత్రిక పాలసీ అన్న సంగతి బహిరంగ రహస్యం.

 

 

అయితే ఏ పత్రిక అయినా పక్షపాత రహితంగా ఉన్నప్పుడే దానికి విలువ. అది ఎప్పుడైతే ఓ సైడ్ తీసుకుంటుందో అప్పటి నుంచి దానికి ఇబ్బందులు తప్పవు. అదే పరిస్థితి ఇప్పుడు ఆ పత్రికది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. ఇటు తెలంగాణలో కేసీఆర్ దగ్గర మాత్రం ఆ పప్పులు ఏమాత్రం ఉడకలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఈ అతిజ్యోతి తోకలు కత్తిరించేశారు. దీంతో కాళ్ల బేరానికి రాక తప్పలేదు.

 

 

ఇక ఏపీలో అధికారం మారేసరికి సీన్ మారిపోయింది. అసలే అధికారంలో ఉన్నది జగన్. తన ఆజన్మ ప్రత్యర్థి.. అందుకే మరోసారి తన పక్షపాత కలం ప్రయోగించాడు. దీంతో చిర్రెత్తు కొచ్చిన జగన్ ఏకంగా మీడియాపై చర్యలు తీసుకునేందుకు ఓ జీవో కూడా తీసుకొచ్చేశాడు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తోకలు కత్తిరించేందుకు రెడీగా ఉన్నాడు. అప్పటికీ ఆ మీడియా అధిపతి ఆర్థిక లావాదేవీలను కట్టడి చేసేసినట్టు సమాచారం.

 

 

ఇక ఇటు తెలంగాణలో కాళ్లబేరానికి వచ్చినా అడపాదడపా తన పాత బుద్ధి అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే మొన్న కరోనా విషయంలో డాక్టర్లకు కిట్లు లేవనే కథనం వచ్చింది. అది చూసి కేసీఆర్ కోపం నషాళానికి అంటింది. మీ సంగతి చెబుతా.. మామూలుగా వదలను .. కేసీఆర్ అంటే ఎలా ఉంటదో చూపిస్తా అంటూ పబ్లిక్‌గానే వార్నింగ్‌ ఇచ్చేశాడు. సో.. అటు జగన్, ఇటు కేసీఆర్ ఇద్దరూ కత్తి కట్టారు..పాపం.. ఈ పత్రిక పరిస్థితి ఏంటో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: