కరోనాకు ఇప్పటి వరకూ మందు కనిపెట్టలేకపోయారు. కానీ కొంత వరకూ ఓ మందు మాత్రం బాగానే పని చేస్తోంది. దాన్ని వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలుకొని మన ఐసీఎంఆర్‌ వరకూ చెప్పేశాయి. దీంతో ఇప్పుడు ఈ మందుకు విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. ఆ మందే హైడ్రాక్సీ క్లోరో క్విన్‌.. సింపుల్ గా హెచ్‌సీక్యూ అని పిలుస్తారు. వాస్తవానికి దీన్ని మలేరియాను తగ్గించేందుకు వాడతారు.

 

 

కరోనా వ్యాధి గ్రస్తులపై చేసిన అనేక ప్రయోగాల్లో ఈ హైడ్రాక్సీ క్లోరో క్విన్‌ బాగా పని చేసింది. అయితే ఈ మందు తయారీ దారుల్లో ప్రపంచంలోనే ఇండియా టాప్ లిస్టులో ఉంది. మన ఇండియాలో ఈ మందు నిల్వలు కూడా భారీగా ఉన్నాయి. అంతే కాదు ప్రపంచంలోని 70 శాతం అవసరాలు తీర్చగల సత్తా ఇండియాకు ఉందట. దాంతో ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు మన దేశాన్ని తమకూ ఆ మందు పంపించమని వేడుకుంటున్నాయి. అమెరికా వంటి దేశాలైతే పరోక్షంగా బెదిరిస్తున్నాయి కూడా.

 

 

అమెరికాయే కాదు.. బ్రెజిల్‌ వంటి దేశాల నుంచి ఈ మందు కావాలని ఆర్డర్లు వస్తున్నాయి. ఈ హైడ్రాక్సీ క్లోరో క్విన్‌ మందు తయారీ మన దేశంలోనే ఎక్కువ. ఇండియన్ ఫార్మా కంపెనీలు ఇప్కా లేబొరేటరీస్‌, జైడస్‌ క్యాడిల్లా, సిప్లా, వాల్లేస్‌ ఫార్మాస్యూటికల్స్‌, సన్‌ ఫార్మా వంటి వాటికి ఈ హైడ్రాక్సీ క్లోరో క్విన్‌ ను బల్క్ గా తయారు చేయగల కెపాసిటీ ఉంది. మనదేశంలోని ఫార్మా కంపెనీలు ప్రతి నెలా 20 కోట్ల హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను తయారు చేస్తాయి. అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా చేయగలవు.

 

 

మరి విదేశాలకు ఆ సత్తా ఎందుకు లేదంటారా.. ఇక్కడే ఉందో అసలు విషయం. ఆ దేశాలు ఎప్పుడో మలేరియాను పూర్తిగా జయించేశాయి. అందుకే ఆ మందు ఉత్పత్తిని చేయడం లేదు. మన ఇండియాలో ఇంకా మలేరియా సమస్య ఉండటం వల్ల మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు అది మనకు కలసి వచ్చింది. ప్రపంచం మొత్తం మనవైపే చూస్తోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: