కరోనా వల్ల అన్ని పనులు ఆగిపోవడమే కాదు.. అన్ని విషయాల్లో కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది.. ఇక మొన్నటి వరకు కరెంట్ బిల్లులు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పిన అధికారులు తాజాగా, ఆన్ లైన్ ద్వారా బిల్లులు చెల్లించండని చెబుతున్నారు.. అదెలా అంటే పోయిన, అదేనండి 2019 మార్చి నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో అంతే చెల్లించమంటున్నారు.. ఒక వేళ మీరు కట్టిన బిల్లు మీ వాడకంలో ఎక్కువైతే ఇంకా చెల్లించవలసి ఉంటుంది.. అదే తక్కువైతే, అందులో మిగిలిన డబ్బులను నెక్స్ట్ మంత్ బిల్లులో కలిపి వేస్తారట..

 

 

ఇక దీనికి సంబంధించిన వివరాలన్నీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు వినియోగదారుల ఫోన్‌కు మెసేజ్ ద్వారా పంపుతారట.. ఇకపోతే లాక్‌డౌన్‌ కారణంగా మీటరు రీడింగ్‌ తీసుకునే అవకాశం లేనందున డిస్కంలకు ఈ వెసులుబాటును కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి, మంగళవారం ఆదేశాలు జారీచేసింది. అయితే లాక్‌డౌన్ ముగిసిన వెంటనే రీడింగ్ తీస్తారట.. మీకు ఇక్కడొక డౌట్ రావచ్చూ.. మార్చి 1 నుంచి మే 1 వరకూ 60 రోజులకు ఒకేసారి రీడింగ్‌ తీస్తారు కాబట్టి, శ్లాబ్‌ మారిపోయి ఎక్కువ యూనిట్లు బిల్లు వస్తుందనే భయం అవసరం లేదని చెబుతున్నారు అధికారు.. ఎందుకంటే ఇలాంటి సమస్య రాకుండా, ఆన్‌లైన్‌ సర్వర్‌లో మార్పులు చేస్తున్నారు.

 

 

రీడింగ్‌ ఎన్ని రోజులకు, ఎన్ని నెలల తరువాత తీసినా దాన్ని 30 రోజులకు బిల్లు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణ డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి మీడియాకు తెలిపారు.. ఇక విద్యుత్ బిల్లులు కట్టడం ఆగిపోతే  సిబ్బంది వేతనాల చెల్లింపులకు ఇబ్బందులు రావడమే కాకుండా, విద్యుత్‌ సంస్థలకు ఆదాయం పడిపోతే కరెంటు కొనుగోలులో అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుని ఆన్‌లైన్‌ ద్వారా కరెంటు బిల్లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: