ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ చాప కిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  ఎంత కట్టడి చేస్తున్నా ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.   రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 314కు పెరిగింది. గుంటూరులో 8 కేసులు నమోదు కాగా...కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందగా...ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  

 

ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో కేసుల సంఖ్య 43కి చేరింది. గుంటూరు జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 29, కడప జిల్లాలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 24, పశ్చిమగోదావరిలో 21 కేసులున్నాయి. ఏపీలోని మొత్తం కేసుల్లో సగానికి పైగా కర్నూలు.. నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి.

 

ఏపీ ప్రభుత్వం కరోనా రోగుల కోసం ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వెంటిలేటర్లు తీసుకుంది. ఈ కాలనికి అద్దె చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.  ప్రైవేట్ ఆసుపత్రుల్లో  తీసుకున్న వెంటిలేటర్లకు అద్దే చెల్లించడంతో పాటు సురక్షితంగా అప్పగించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకున్నట్లు ప్రకటించింది.  కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: