ప్రపంచం మొత్తాన్ని కబళిస్తూ  ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది మహమ్మారి కరోనా . కంటికి  కనిపించకుండా దాడి చేసి ప్రాణాలను సైతం హరించుకుపోతుంది. దీంతో చాలామంది ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి వైరస్ ను  పారదోలేందుకు.... సర్వ ప్రయత్నాలు చేస్తున్న  విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి వైరస్ కి ఇప్పటివరకు సరైన విరుగుడు కూడా లేకపోవడం నివారణ  ఒక్కటే మార్గం కావడంతో ప్రజల్లో  మరింత భయందోళన  నెలకొంది . అయితే చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాల ను బెంబేలెత్తిస్తోంది. 

 

 

 ముఖ్యంగా కొన్ని దేశాల్లో అయితే పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతున్నాయి. ఆయా దేశాల్లో ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసినప్పటికీ... ప్రజలందరూ  ఇంటికే పరిమితం అయ్యేలా నిబంధనలు తెచ్చినప్పటికీ కరోనా వైరస్ విజృంభణ  మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే చైనా తర్వాత కరోనా వైరస్ ప్రభావం  ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా స్పెయిన్ ఇటలీ దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటలీ  దేశంలో అయితే రోజుకు కరోనా కోరలు చాస్తున్న   నేపథ్యంలో అక్కడ చాలామంది ప్రజలు పిట్టల్లా రాలి పోతున్నారు . ఎంతో అభివృద్ధి చెందిన దేశామైనా  ఇటలీ తమ దేశాన్ని కరోనా  వైరస్ భారీ నుంచి కాపాడండి అని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది

 

 

 ఇటలీ దేశంలో కరోనా వైరస్  గట్టి దెబ్బ కొట్టింది అని చెప్పాలి. కరోనా తో  ఇటలీ దేశం తీవ్ర విషాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషాదం నుంచి ఇప్పుడే ఇటలీ దేశం కోలుకుంటుంది. గత వారం తో పోల్చుకుంటే ఈ వారం ఇటలీలో  నమోదైన కేసుల సంఖ్య చాలా మటుకు తగ్గింది. అంతేకాకుండా కరరోనా  వైరస్ బారినపడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్న అనుమానితుల సంఖ్య కూడా పెరిగింది. ఐసీయూలో కరోనా కేసుల  సంఖ్య తగ్గడం చాలామంది డిశ్చార్జ్ అయ్యి  కోలుకుంటుండటంతో  ఇప్పుడిప్పుడే ఇటలీలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: