ప్ర‌పంచంలోనే నేడు క‌రోనా సంక్షోభానికి డ‌బ్ల్యూహెచ్‌వో వైఫ‌ల్య‌మే కార‌ణ‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అంత‌ర్జాతీయ సంస్థ‌ను నిందించారు. అంతేకాదు చైనాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపించారు. ప‌నిలో ప‌నిగా ఇంత‌కు ముందే అమెరికా అంద‌జేస్తుంద‌ని ప్ర‌క‌టించిన నిధుల‌ను కూడా నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. అమెరికాలో రోజురోజుకీ వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతుండడం ఆ దేశ ప్రజల్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. శ్వేతసౌధం యంత్రాంగమంతా వైరస్‌ను కట్టడి చేయడంలోనే నిమగ్నమైంది. అయినా వైర‌స్ నియంత్ర‌ణ సాధ్యం కాక‌పోవ‌డంతో ట్రంప్‌లో ఆందోళ‌న ఎక్కువ‌వుతోంది.

 

ఈనేప‌థ్యంలోనే ఆయ‌న అంత‌ర్జాతీయ సంస్థ‌లు, దేశాల‌ను నిందిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా నుంచి ఇవ్వాల్సిన నిధుల్ని నిలిపివేస్తూ అధ్య‌క్షుడు ట్రంప్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా సంస్థపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. డబ్ల్యూహెచ్‌ఓ చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు.  వైరస్‌ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో దాని ప్రమాదంపై సంస్థ వద్ద సమాచారం ఉందని.. అయినా పంచుకోవడానికి ఇష్టపడలేదని ట్రంప్ డ‌బ్ల్యూహెచ్‌వోను ఉద్దేశించి అన్నారు. అంత‌ర్జాతీయ సంస్థ కరోనా మహమ్మారి విషయంలో చాలా తప్పటడుగులు వేసిందని విమర్శించారు.

 

 చైనాలో కొవిడ్‌-19 విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే ప్ర‌పంచ దేశాల‌ను అల‌ర్ట్ చేయాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మరోవైపు కొవిడ్‌-19పై డబ్ల్యూహెచ్‌ఓ స్పందిస్తున్న తీరుపై సెనేట్‌ విదేశాంగ సంబంధాల కమిటీ ఛైర్మన్‌ జిమ్‌ రిష్ సైతం ప‌లు అనుమానాల‌ను వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అంతేకాదు డబ్య్లూహెచ్‌ఓపై సతంత్ర దర్యాప్తునకు ఆదేశించ‌డం ప్ర‌పంచ దేశాల్లో చ‌ర్చ‌నీయాంశంమైంది. ఇదిలా ఉండ‌గా  టెడ్రోస్‌ అధనోమ్‌ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌గా రాజీనామా చేసే వరకు నిధుల్ని నిలిపివేయాలని కోరుతూ అమెరికాలో ఉభయపక్షాలకు చెందిన 24 మంది సభ్యులతో కూడిన చట్టసభల ప్రతినిధుల బృందం తీర్మానించ‌డం గ‌మ‌నార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: