క‌రోనా వైర‌స్ ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. సామాన్యుడి నుంచి దేశాధినేత‌ల వ‌ర‌కు దీని బారిన‌ప‌డుతున‌నారు. క‌రోనా బాధితుల‌కు సేవ‌లు అందిస్తున్న వైద్యుల‌తోపాటు సిబ్బంది కూడా వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు వైద్యులు, న‌ర్సులు ఆస్ప‌త్రుల‌తో చికిత్స పొందుతున్నారు. తాజాగా.. ఢిల్లీలో విధులు నిర్వ‌ర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్ కూడా క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను క్వారంటైన్‌లో ఉంచారు. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రెవ‌రిని క‌లిశారు..?  అన్న‌దానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.  కొద్దిరోజులుగా ఆయ‌న జ్వ‌రంతో బాధ‌ప‌డుతుండ‌గా అస్ప‌త్రి త‌ర‌లించి ప‌రీక్ష చేయ‌డంతో కొవిడ్‌-19 అని తేలింది.  ఇప్ప‌టివ‌ర‌కు వైద్య‌సిబ్బందికి మాత్ర‌మే కొవిడ్‌-19 సోకింది. తాజాగా.. ఇత‌ర శాఖ‌ల సిబ్బందికి కూడా వైర‌స్ సోక‌డంతో కొంద ఆందోళ‌నక‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. దీంతో అధికారులు కూడా వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకునే చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

 

ఇదిలా ఉండ‌గా.. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా 5351 కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 160మంది మ‌ర‌ణించార‌ని అధికారులు వెల్ల‌డించారు. అయితే, ఏప్రిల్ 14 త‌ర్వాత కూడా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా..?  లేక కొన‌సాగిస్తారా..? అన్న విష‌యంలో ఈరోజు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ రోజు అఖిల‌ప‌క్షాల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. అంతేగాకుండా.. క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ కొనసాగించాల‌ని ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తోపాటు రాజ‌స్తాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో మోడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోచూడాలి మ‌రి. ఇక‌, ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ త‌న ప్ర‌తాపం చూపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 14ల‌క్ష‌ల‌మందికిపైగా క‌రోనా బారిన‌ప‌డగా, 82వేల మందికిపైగా మ‌ర‌ణించారు. ముందుముందు ఈ సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: