భారతదేశం అంతటా లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీసులు అహోరాత్రులు శ్రమ పడుతున్నారు. అలాగే కరోనా మహమ్మారి ఎంతటి ప్రాణాంతకమైన అంటువ్యాధో ప్రజలకు చాలా చక్కగా అవగాహన కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు వైద్యులు ఎంతగా పోరాటం చేస్తున్నారో... దాదాపు అదే స్థాయిలో పోలీసులు కూడా కరోనా వ్యాప్తి ని నిర్మూలించేందుకు నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు. ఇళ్లకు పోకుండా ఎర్రటి ఎండలో వారు చేస్తున్న శ్రమకు సామాన్య ప్రజలు ఎవరైనా చప్పట్లు కొట్టాల్సిందే. అయితే నాగపూర్ లోని గట్టిఖాదన్ ప్రాంతవాసులు నిజంగానే తమ స్థానిక పోలీసుల మెచ్చుకోదగ్గ సేవలను గుర్తించి చప్పట్లు కొడుతూ పూలవర్షం కురిపించారు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... నాగపూర్ లోని గట్టిఖాదన్ డీసీపీ జోన్ 2 లో ఎస్.వనిత నేతృత్వంలో 60 మంది పోలీసులు రూట్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఓ పోలీసు వాహనం యొక్క మైక్ కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతుండగా దాని వెనుక డీసీపీ ఎస్.వనిత మిగతా 60 మంది పోలీసుల తో రూట్ మార్చి చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ప్రజలు వారందరికీ చప్పట్లు కొడుతూ... వారిపై పూల వర్షం కురిపించారు. దాంతో డీసీపీ వనిత తో సహా మిగతా పోలీసులంతా ప్రజలు తమ మీద చూపిస్తున్న ఆప్యాయతకు మంత్రముగ్ధులయ్యారు.



ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియోని నాగపూర్ సిటీ పోలీస్ యొక్క ఆఫీసియల్  సోషల్ మీడియాలో షేర్ చేయగా... ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. మా పోలీసు సిబ్బంది పైన పూల వర్షం కురిపించి మరీ మీ ఆప్యాయత, ప్రేమ చూపిన నాగపూర్ ప్రజలందరికీ మా ధన్యవాదాలు అంటూ ఈ వీడియో కి ఒక కాప్షన్ జత చేశారు నాగపూర్ పట్టణ పోలీసులు. మొన్నీమధ్య ఢిల్లీ ప్రభుత్వ డాక్టర్లకు కూడా చాలా మంది సామాన్య ప్రజలు చప్పట్లు కొట్టే వారిని ఎంతో ప్రోత్సహించారు. ఈ విపత్కర సమయంలో రేయనకా పగలనకా పనిచేసే పోలీసులను, వైద్యులకను, ఇంకా అత్యవసర సేవలు అందించే ప్రతి ఒక్కరిని మనం అభినందించడం ఎంతైనా అవసరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: