ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిర్మూల చేయడానికి ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు ఈ కరోనా విజృంభనను మత్రం అరికట్టలేకపోతు న్నారు.  లాక్ డౌన్ చేస్తూ ఎంతో మంది రోడ్లపై తిరగడం.. ఇష్టానుసారంగా ప్రవర్తించడం జరుగుతుంది.  తాజాగా మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ సిబ్బంది. ఆడియో టేపుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రజినీ.

 

ఎక్సైజ్ సిబ్బందిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం.ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. ఏపిలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి లంచాలు తీసుకున్నా వారిపై సత్వర చర్యలు తీసుకోవాలని.. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు చెప్పిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం కరోనా వైరస్ ఇబ్బందితో ప్రజల్లు తల్లడిల్లి పోతున్నారు.

 

 ఇలాంటి సమయంలో ఈ క్రమంలోనే  ఎమ్మెల్యే విడదల రజని ఎక్సైజ్ స్టేషన్‌ను తనిఖీ చేసి ఆడియో టేపుల ఆధారంగా రాం ప్రసాద్ లంచాల బాగోతం తెలుసుకొని విచారణ చేపట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు రాం ప్రసాద్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  ప్రస్తుతం ఏపిలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు.  ఇలాంవి విషయాలు మళ్లీ ఎక్కడైనా పునరావృతం అయితే పరిస్థితి సీరియస్ గా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: