చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా థాటికి ప్ర‌పంచ‌దేశాలు అల్ల‌క‌ల్లోలం అవుతున్నాయి. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడ్డాయి. అయిన‌ప్ప‌టికీ కంటి క‌నిపించ శ‌త్రువుతో ఆయుధం లేకుండా యుద్ధాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నాయి. మ‌రోవైపు భార‌త్‌లోనూ క‌రోనా జోరు రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే ఇండియాలో కేంద్ర ఆరోగ్య శాఖ తాజా అధికారిక లెక్కల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5వేలు దాటి... 4194గా నమోదైంది.

 

అయితే వీటిలో 402 కేసుల్లో బాధితులు రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. అలాగే... మృతుల సంఖ్య 149కి చేరింది. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా రాని జిల్లాలో ముందు నిలిచిన శ్రీకాకుళంలో అధికారులు, ముందు జాగ్రత్త చర్యగా ఓ వినూత్న ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘కరోనా నిరోధక టన్నెల్‌’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.  శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులో తాత్కాలిక మార్కెట్‌ వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన టన్నెల్‌ను మంగళవారం కలెక్టర్‌ జె.నివాస్ స్టాట్ చేశారు.

 

దీని స్పెషాలిటీ ఏంటి అంటే.. ఇందులోకి ఓసారి ప్రవేశించి, బయటకు వస్తే, ఇన్ఫెక్షన్ రహితం కావచ్చు. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ టన్నెల్‌లో, కరోనా తదితర ఇన్ఫెక్షన్లను వెదజల్లే క్రిములను నాశనం చేసేలా రసాయనాలను అనుక్షణం చల్లుతుంటారు. దీనిలో నిరంతరాయంగా సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే అవుతూ ఉంటుంది. టన్నెల్ లో నడిచి వెళితే, ఈ ద్రావణం పిచికారీ అయి దుస్తులు, శరీరంపైనా ఉండే క్రిములు, వైరస్‌లు నశించిపోతాయి. కాగా, శ్రీకాకుళంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ టన్నెల్‌ను బాలాజీ ఫ్యాబ్రిక్స్‌ సంస్థ తయారు చేసింది. ఇందుకోసం సుమారు రూ.లక్ష లోపే ఖర్చయింద‌ట‌.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: