కరోనా వైరస్ విషయంలో ప్రపంచం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో 200కు పైగా దేశాలలో విస్తరించి ఉంది. ఎక్కువగా అగ్రరాజ్యం అమెరికా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజులో కనీసం వెయ్యి మంది మరణాలు అదేవిధంగా కొన్ని వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు అమెరికా దేశంలో నమోదవుతున్నాయి. ఇప్పటి దాకా పరిస్థితి చూస్తే నాలుగు లక్షలకు పైగానే అమెరికా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ కి గట్టి మందు హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ కావటంతో ఈ మందు ఎక్కువగా ఇండియా నెలకు దాదాపు 20 కోట్ల టాబ్లెట్ లు సృష్టించే దేశం కావడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇండియా సాయాన్ని కోరారు.

 

ఈ విషయంలో ఇటీవల ప్రధాని మోడీ తో ఫోనులో సంభాషించారు. ఇటువంటి నేపథ్యంలో మోడీ సర్కార్ మానవతా దృక్పథంతో హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ నీ ఎగుమతి చేయాలని ఆలోచిస్తున్నట్లు అంగీకరించినట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూరే విధంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ మీడియా ఫాక్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  క్లారిటీ ఇచ్చారు.

 

ఈ ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఛానల్ లో అనేక విషయాల గురించి డోనాల్డ్ ట్రంప్ కు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మోడీకి తనకు జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి పేర్కొన్నారు. యూఎస్ కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనలు చేస్తోందని, క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ట్రయల్స్ పూర్తయ్యి వ్యాక్సిన్ రెడీ అయితే అందుబాటులోకి వచ్చిన వెంటనే మొదట ఇండియాకు ఈ మెడిసిన్ ను ఎగుమతి చేస్తామని మోడీకి హామీ ఇచ్చామని, ఈ హామీ తరువాత మోడీ హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ ను ఎగుమతి చేసేందుకు అంగీకరించారని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: