కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మందుబాబులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కొన్ని ప్రాంతాలలో మద్యం లభించక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. మద్యం దొరకకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రతిరోజూ మూడు గంటల పాటు మద్యం దుకాణాలు తెరిచేలా ఆదేశాలు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు తెరవాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 14 తరువాత కేంద్రం లాక్ డౌన్ ను కొనసాగిస్తే కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకురాబోతుందని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రజా ఆరోగ్యం, రాష్ట్ర ఆదాయం, ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
కానీ ఈ నిర్ణయం అమలులోకి రావడం కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కేరళ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల విషయంలో ఆ రాష్ట్ర కోర్టు షాక్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం అమలులోకి తెస్తే పరోక్షంగా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
మద్యం అమ్మకాలు చేపట్టే సమయంలో ఏ తప్పు జరిగినా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు, ప్రజా సంఘాలు అవసరమైన వారికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే తగిన మోతాదులో మద్యం ఇవ్వాలని సూచిస్తున్నాయి. వైద్యులు, ప్రజా సంఘాల నాయకుల సూచలనకు అనుగుణంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరిచే విషయంలో వెనక్కు తగ్గనుందని ప్రచారం జరుగుతోంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: