ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఉన్న కొద్దీ బలపడుతోంది. ఈ వైరస్ కి ఇప్పటివరకు మందు లేకపోవడంతో నియంత్రణ ఒకటే మార్గం కావడంతో ప్రపంచంలో చాలా దేశాలు దాదాపు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ ఇనుము పై మరియు ప్లాస్టిక్ పై మూడు రోజులు బతికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలియజేశారు. ఇదిలా ఉండగా తాజాగా హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకుల నివేదిక ప్రకారం కరెన్సీ నోట్లపై కరోనా వైరస్ దాదాపు ఏడు రోజులు బతికే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఏడు రోజులు అంటే మామూలు విషయం కాదు అది కూడా కరెన్సీ నోట్లు అంటే చాలా ప్రమాదకరం అని అంటున్నారు.

 

ప్రతిరోజు పాళ్ళు, నీళ్ళు, కూరగాయలు అదేవిధంగా మందులు కొనుగోలు సమయంలో నోట్ల మార్పిడి జరగడం గ్యారెంటీ మరి అటువంటి టైంలో నోట్ల కట్టలపై కరోనా వైరస్ ఉండే ఉంటుంది అని వచ్చిన వార్తల గురించి తెగ భయపడిపోతున్నారు ప్రజలు. ఇటువంటి తరుణంలో నోట్ల కట్ట నుండి కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటిలో ఉండే ఐరన్ బాక్స్ ద్వారా వైరస్ అరికట్టవచ్చని...అది చాలా సులభమైన అత్యుత్తమమైన మార్గమని అంటున్నారు. ఉదాహరణకు ఒక ₹100 నోటు తీసుకుని మార్కెట్ కు  వెళ్లారనుకుందాం. మార్కెట్ లో ఉన్న షాపు యజమాని ఇచ్చిన చిల్లర మీ జేబులో, మీ పర్సులో పెట్టుకోవద్దు. మీతో పాటు ఒక చిన్న ప్లాస్టిక్ కవర్, లేదా సంచి తీసుకెళ్లి అతను తిరిగి ఇచ్చిన చిల్లరను అందులో పెట్టుకోండి.

 

మీ కొనుగోళ్లు అయిపోయి ఇంటికి వచ్చాక సరుకులు జాగ్రత్తగా ఓ మూలన పెట్టి ఇంట్లో వారిని అడిగి బట్టలు ఆరేసే ఒక క్లిప్ తీసుకోండి. మీ వద్ద ఉన్న నోట్లు అని ఆ క్లిప్ కు పెట్టండి. ప్లాస్టిక్ కవర్ మూత ఉన్న డస్ట్ బిన్ లో వేయండి. ఒక న్యూస్ పేపర్ మీద ఒక్కో నోటును పెట్టి ఐరన్ చేయండి. రెండు వైపులా చేయండి. ఐరన్ బాక్స్ మీరు ముట్టుకోవద్దు. మీ ఇంట్లో వారే ముట్టుకోవాలి. మీరు నోట్లను మాత్రమే ముట్టుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా కరోనా వైరస్ నోట్ల ద్వారా రాదని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: