క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అనుస‌రిస్తున్న లాక్‌డౌన్ ను కొన‌సాగించాలా...?  ఎత్తివేయాలా..?  లేక ప్ర‌త్యామ్నాయం ఉందా..?  అన్నదానిపై  కేంద్రం ఆలోచ‌న చేస్తోంది. ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల నుంచి లాక్‌డౌన్ పొడించాల‌ని ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తులు అందుతున్నాయి. తాజాగా లాక్‌డౌన్ పై చ ర్చించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బుధ‌వారం మ‌ధ్యాహ్నం పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ నుంచి కే. కేశ‌వ‌రావు, నామా నాగేశ్వ‌ర్‌రావు పాల్గొన్నారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి వారు ప్ర‌ధానితో మాట్లాడుతున్నారు. తెలంగాణ‌లో ప‌రిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వ‌స్తుంద‌ని, లాక్‌డౌన్‌ను మ‌రికొంత కాలం పొడిగించిన‌ట్ల‌యితే క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని ఎంపీలు సూచించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా లాక్‌డౌన్ ను పొడిగించాల‌ని ఇప్ప‌టికే త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసిన విష‌యాన్ని వారు ప్ర‌ధానికి గుర్తు చేశారు.  కాగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాల మేర‌కు లాక్‌డౌన్ పొడిగింపుపై ఆలోచ‌న చేస్తున్నామ‌ని ఈసందర్భంగా ప్ర‌ధాని మోడీ పేర్కొన్న‌ట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: