ప్రస్తుత పరిస్థితుల్లో.. అలుపెరగని ఆసనాలతో.. కంటికి కనిపించని కరోనాను తరిమి కొట్టొచ్చని.. ఎంతోమంది యోగా నిపుణులు సూచిస్తున్నారు. యోగా చరిత్ర ఈనాటిది కాదు. అతి పురాతనమైన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంటూ వస్తున్న అద్భుతం. మొహంజదారో నాగరితక నాటి నుంచి నేటి వరకు యోగాయానం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. 

 

మొహంజదారో నాణేలపైన ఒక యోగ ముద్ర కనిపిస్తుంది. మోకాళ్లు ఎడంగా, పాదాలు దగ్గరగా ఉంటాయి. ఈ ముద్రా సమయంలో జంతువులన్నీ చుట్టూ చేరిన దృశ్యం. రుగ్వేదం యోగాను ఒక సంయోగంగా పేర్కొంటుంది. యోగతత్వాన్ని సృష్టించింది రుగ్వేదంలో దైవశక్తిగా కీర్తించబడే హిరణ్యగర్భుడేనని కొందరి భావన. యోగాను ఒక యుద్ధరథంగా కూడా విశ్లేషిస్తారు. అదే ఇప్పుడు కరోనా కార్యక్షేత్రంలో.. క్షిపణిగా ఉపయోగించాలని చెబుతున్నారు.

 

మహాభారతంలోని భగవద్గీతలో కృష్ణుడు పరమాత్మ సంబంధిత విషయాల గురించి చెబుతూ ఓ వంద సార్లు అయినా యోగా అనే పదాన్ని ఉపయోగిస్తాడు. భారతం ఆ కాలం నాటిదని కొందరి భావన. మనో నియంత్రణకు సాధనంగా కఠోపనిషత్తు తొలిసారి యోగా అనే మాటను ఉపయోగిస్తుంది. యోగా ఆత్మను, పరమాత్మతో సంలీనం చేస్తుందని చెబుతుంది. ప్రాణశక్తి గురించి ఉపనిషత్తులు కూడా ప్రస్థావించాయి. వీటితోనే కరోనా పని పట్టొచ్చని ఎంతో మంది దేశ, విదేశాల్లోని మన యోగా ప్రముఖులు..గురువులు చెబుతున్నారు. కరోనా కష్ట కాలంలో యోగాని మించిన అస్త్రం లేదంటున్నారు. 

 

పతంజలి యోగసూత్ర అనే గ్రంథం.. యోగ జ్ఞానానికి పెద్ద నిధి లాంటిది.  ఎనిమిది విధానాలుగా చెప్పబడే ఆసనాలతో సహా చేసే అష్టాంగ యోగాతో కరోనాను పటాపంచలు చేయొచ్చని యోగపుంగవులు సూచిస్తున్నారు. బుద్ధుని దృష్టిలో యోగ సాధన, ఒక పరిపూర్ణ మేధస్సుకు మార్గమవుతుంది. అందుకే మనం చేసే యోగా టైపులోనే.. కరోనా జన్మ స్థలమైన  చైనాలో బౌద్ధ గురువులు చెప్పారని.. చైనీయులు  మన యోగాను పోలిన ఫాలున్ దఫా చేయడం ద్వారా చైనా ప్రజలు కరోనా నుంచి ఉపశమనం పొందుతున్నట్టు తెలుస్తోంది. చిన్నపాటి వ్యాయామాలు, ధ్యానంతో శరీరం, మనసును అదుపులో పెట్టుకోవడమే ఈ ఫాలున్ అభ్యాస లక్ష్యం.  దీనివల్ల ఆయుర్ధాయం పెరగడంతోపాటు శరీరంలోని తెల్ల రక్తకణాలు మరింత చురుగ్గా కదులుతాయని చెబుతున్నారు నిపుణులు. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన ఎందరినో ఈ ఫాలున్ దఫా బయటపడేసిందని చెబుతున్నారు.  

 

లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లల్లోనే ఉంటున్న వారు యోగా సాధన చేసి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని భారత అమెరికన్‌ కార్డియాలజిస్ట్‌ ఇంద్రానిల్‌ బసు రే చెబుతున్నారు.  హృద్రోగుల విషయంలో ధ్యానం, యోగా చాలా మేలు చేసినట్లు గమనించామన్నారు. యోగా అంటే ఒక ఆసనం అని చాలామంది అనుకుంటారని.. కానీ వాస్తవంగా యోగాలో అధికశాతం ప్రక్రియ శ్వాస తీసుకునే విధానంపై నియంత్రణ రూపంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్వాస నియంత్రణపై పట్టు సాధిస్తే.. ఒత్తిడిని సులభంగా జయించవచ్చని తెలిపారు. టెన్సెసీలోని మెంఫిస్‌ వెటరన్‌ ఆస్పత్రిలో ప్రజా ఆరోగ్య విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన, లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల మానసిక స్థితి ఎలా ఉండాలో వివరించారు. ఇంట్లోనే ఉంటున్నామన్న ఆందోళనకు, నిరాశకు గురైతే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని వెల్లడించారు. యోగా, ధ్యానంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నదానికి సాక్ష్యాలున్నాయన్నారు. వాటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆందోళన దూరమై ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కరోనా రోగుల్లో గుండె సమస్యలు కూడా తలెత్తుతున్నప్పటికీ.. యోగా సాధనతో రోగ నిరోధక శక్తి పెంచుకుని... సంతోషంగా ఉండొచ్చని చెబుతున్నారు. 

 

మరోవైపు, అమెరికాలో యోగాపై నిషేధం ఎత్తివేశారు. ఇప్పటి వరకు భారత్‌కు  చెందిన యోగా మనకు అవసరమా అన్న అమెరికన్లే.. ఇప్పుడు ఇండియా గొప్పదేశమని..అక్కడ పుట్టిన యోగా అద్భుతమని కొనియాడుతున్నారు. యోగా బాట పడుతున్నారు. అమెరికాలో కరోనా శివతాండవానికి యోగాతోనే చెక్‌  పెట్టొచ్చని ఆసనాలు వేయడంలో పోటీ పడుతున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు... యోగాతో కరోనా ఒత్తిడిని జయించవచ్చంటూ హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వెల్లడించడంతో..అమెరికన్లలో యోగాపై విపరీతమైన ఆసక్తి పెరుగుతోంది. నానాటికీ  సాధారణ మెడిటేషన్‌తోనే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, దీన్ని నేర్పేందుకు యోగా స్టూడియో, పాకెట్‌ యోగా వంటి యాప్‌లు ఉన్నాయని మానసిక వైద్య నిపుణుడు జాన్‌ షార్ప్‌ చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: