కరోనా వైరస్ వల్ల అమెరికాలో మరణాలు నానాటికి పెరిగిపోతున్నాయి . కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి .ఇదిలా ఉండగా అమెరికా  WHO ని బెదిరించే పనిలో పడింది . WHO  కు ఇప్పుడు అమెరికా ఇచ్చే నిధులను ఆపివేస్తానని చెబుతోంది . మరి అమెరికా WHO కు ఎంతమేర నిధులను ఆపివేస్తున్నారో క్లారిటీ ఇవ్వలేదు . అదేవిధంగా చైనా కు WHO  కాపు కాస్తోందని ఆరోపిస్తోంది . అమెరికాలో ఇప్పటివరకు 333811 కరోనా కేసులు నమోదు కాగా 9559 మరణాలు సంభవించాయి 
 
వివరాలలోకి వెళితే ట్రంప్ WHO మీద ఆరోపిస్తున్న ఆరోపణలేంటంటే , WHO  మాకు కరోనా వైరస్ గురించి సరైన సమాచారం అందించలేదని ఆరోపిస్తోంది . అదేవిధంగా కరోనా వైరస్ యొక్క వ్యాప్తి ని ఎలా అడ్డుకోవాలో మాకు వివరించలేదని ఆరోపిస్తోంది . చైనా కు  WHO కాపుకాస్తోందని చెబుతోంది .  అందుకే మేము WHO కి నిధులు ఆపివేస్తున్నట్లు ప్రకటించింది . మరి ఎంతమేరకు  నిధులను కొత్త విధిస్తుందో వివరించలేదు . అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కేవలం WHO నే కాకుండా మిగతా మిత్రదేశాల మీదకూడా విరుచుకుపడుతూ ..బెదిరిస్తోంది 

మరింత సమాచారం తెలుసుకోండి: