తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరోనా సమయంలో ఇప్పడు ఆయన పొరుగు రాష్ట్రమైన ఏపీలో సేద తీరుతున్నారు. పూర్తిగా హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఒకవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యక్షంగా ఏపీలో లేకపోయినా, మీడియా సమావేశం నిర్వహిస్తునో, ఇతర మార్గాల ద్వారానో నిత్యం మీడియాలో కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా అదుపు చేసేందుకు సలహా ఇస్తానని, వైసీపీ ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరగకుండా నోరోదించడంలో పూర్తిగా విఫలమైందని చంద్రబాబు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు.

IHG

 

ఒకవైపు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కరోనా కట్టడి కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా, వైసీపీ ప్రభుత్వం నిత్యావసరాలు అందించడంతోపాటు ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు నగదును అందిస్తోంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అసలు వైసిపి నాయకులు ఆధ్వర్యంలో ఆ నగదు పంపిణీ చేయడం ఏంటని టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదో రకంగా ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చూస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు కరోనా వైరస్ ఏపీలో వ్యాప్తి చెందకుండా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

 


 అసలు తమ సలహాలు తీసుకోకుండా జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కూడా జగన్ రాజకీయాలు చేస్తున్నారని, ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం అన్ని ఇగోలు పక్కన పెట్టి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలియజేస్తామని, కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కర్ణాటకలో సైతం అఖిలపక్ష సమావేశాన్ని అక్కడ సీఎం యాడ్యుయరప్ప ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ నేత రామకృష్ణ కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ జగన్ కు లేఖ రాశారు. 

 


 ఈ విషయంలో జగన్ మాత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోవడం లేదు. అసలు ఈ విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఏమీ లేదని, ప్రతి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది అంటూ చెబుతున్నారు. గతంలో రాజధానిపై చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు అన్న విషయం కూడా ఇప్పుడు వైసిపి నాయకులు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుపై గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో జగన్ ఏ  నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: