ఆంధ్రప్రదేశ్ లో కరోనా తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 304 కేసులు నమోదు కాగా నిన్న కర్నూలులో 45 ఏళ్ల వ్యక్తి మరణించాడు దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల మరణాల సంఖ్య నాలుగుకి చేరింది. నిన్న రాత్రి నుండి నేటి ఉదయం వరకు ఒక ఒక పాజిటివ్ కేసు గుంటూరు జిల్లాలో నమోదు కాగా తద్వారా గుంటూరు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 33 కి చేరాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రాబోయే రోజుల్లో ఇంకా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు మరియు వైద్యులు అంచనా వేస్తున్నారు.

 

ఇటువంటి క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. పరిస్థితులతో సంబంధం లేకుండా త్వరగా అమరావతి కథ ముగించేయాలని జగన్ ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది. ఇందుకోసం సిఆర్డిఏ వీడియో కాన్ఫరెన్స్ ను R5 ఏరియాలో ఉన్న రాజధాని రైతుల కోసం నిర్వహించనున్నారు.

 

ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య ప్రాంతంలో రైతులు అధికారుల వద్దకు వచ్చి వాళ్ళ అభ్యర్థనలను తెలియజేసి లిఖితపూర్వకంగా అందజేయవలసిందిగా ఆదేశించారు. అయితే ప్రాంతంలో ఉన్న ప్రజలంతా అసలు లాక్ డౌన్ అమలులో ఉన్న పరిస్థితుల్లో తాము వెళ్లి తమ అభ్యర్థనలను ఎలా తెలియజేయాలని ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా వారు సింపుల్ గా ఒక లేఖ రాసి ఇవ్వమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతే అభ్యంతరాలు స్వీకరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో R5 జోన్ పై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన సీఆర్డీఏ అధికారులను రైతులు అడ్డుకున్నారు.  ఇక మరో పక్క, ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 112 రోజూ కొనసాగాయి. తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు సామాజిక దూరం పాటిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. 3 ముక్కల రాజధాని వద్దంటూ నినాదాలు చేశారు. జగన్ అమరావతి తరలింపుపై పునరాలోచన చేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: