దేశంలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రధాని మోదీ ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటన చేశారు. దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాలు మోదీని లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతున్నాయి. ఈరోజు ప్రధాని మోదీ పలు రాజకీయ పార్టీల పార్లమెంటరీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధాని మోదీ లాక్ డౌన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒకేసారి లాక్ డౌన్ ను ఎత్తివేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ గురించి పలువురు ప్రధాని మోదీకి రకరకాల సూచనలు ఇచ్చారు. మోదీ మాత్రం దేశంలో లాక్ డౌన్ ను కొనసాంచాల్సిందే అని చెప్పినట్లు సమాచారం. 
 
ఇప్పటికే లాక్ డౌన్ గురించి మోదీ తన నిర్ణయాన్ని పలువురు ముఖ్య నేతలతో పంచుకుని వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేతపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రకటన చేస్తామని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రధాని మోదీ ఏప్రిల్ 14న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారని తెలుస్తోంది. 
 
కరోనా తర్వాత పరిస్థితులు సాధారణంగా ఉండవని పలు రాష్ట్రాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే సీఎం కేసీఆర్ ఈ నెల 30వరకు లాక్ డౌన్ ను కొనసాగించాలని మోదీని కోరారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో కేసులు నమోదు కాని ప్రాంతాలలో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కోరుతోంది. పాజిటివ్ కేసులు నమోదైన హాట్ స్పాట్లలో మాత్రమే లాక్ డౌన్ ను కొనసాగించాలని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: