ప్ర‌తి ఇంట్లోనూ భార్యా భ‌ర్త‌ల‌కు చిన్న చిన్న చికాకులు, గొడ‌వ‌లు  అనేవి చాలా స‌ర్వ‌సాధార‌ణం. అలాగే అప్పుడ‌ప్పుడు ఆ గొడ‌వ‌ల‌తో వాళ్ళు ఒక‌రి మీద ఒక‌రు అలిగి మాట్లాడుకోరు. అలాంట‌ప్పుడు ఏద‌న్నా మాట్లాడుకోవ‌ల‌సిన అవ‌స‌రం వ‌స్తే ఇంట్లో పిల్ల‌లు ఉంటే వాళ్ళు చెప్పాల్సిన‌వ‌న్నీ వారికి చెబుతుంటారు. మీ మ‌మ్మ‌కి చెప్ప‌మ్మా అంటూ డాడీ... అలాగే మీ డాడీని అన్నం తిన‌మ‌ను అంటూ మ‌మ్మీ ఇలా ప్ర‌తి ఇంట్లో కొన్ని సంద‌ర్భాల్లో జ‌రిగే విష‌యాలే ఇవ‌న్నీ. ఒక మ‌రికొంత మంది భ‌ర్త రాత్రి పడుకునే ముందు భార్య కోసం ఓ చీటీ మీద నన్ను ఉదయం 6 గంటలకు నిద్రలేపు అని రాసి పెట్టి నిద్రపోయాడు. కానీ ఉదయం భార్య నిద్రలేపలేదు. చిర్రెత్తుకొచ్చి భార్య మీదకు ఏమిటి నన్ను లేపలేదు అని అడిగాడు. దానికామె అదిగో సరిగ్గా 6 గంటలకు మీరు రాసిన ఆ చీటీ వెనకాలే నేను లేప‌నండి అని రాశాను చూసుకోలేదా అన్నదట. ఫేస్‌బుక్ కొన్నాళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ లాంచ్ చేసింది. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లను కలిపేందుకు ఉద్దేశించిన యాప్ అది. అందులో వింతేమీ లేదు మరి. కానీ ఇప్పుడు ఫేస్‌బుక్ న్యూ ప్రాడక్ట్ లాంచ్ ఎక్స్‌పెరిమెంటేషన్ టీం సరికొత్త ఓ గమ్మత్తయిన యాప్ లాంచ్ చేసింది. 

 

ఇది కేవ‌లం జంటల కోసం చేసిన యాప్ అట‌. ఒకరికొకరు తెలిసిన జంటల కోసమన్నమాట. ఇంకా చెప్పాలంటే పక్కపక్కన ఉండే వారికోసం. అదిగో మన ముఖ్యంగా స‌ర‌దాగా ఉండే  జంటల కోసమన్న మాట. ఈ యాప్‌కు ట్యూన్‌డ్ అని పేరు పెట్టారు. ఒకరి భావాలు మరొకరికి సరిగా వ్యక్తం చేయలేని జంటలకు ఇది వరప్రసాదం లాంటిది అంటున్నారు. తమ మూడ్స్ గురించి, ఇష్టమైన సంగీతం గురించి, నచ్చిన అంశాల గురించి ఇందులో జంటలు ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు. అయితే డిజిటల్ స్క్రాప్‌బుక్‌లా ఉంటుందిది. మ్యూజిక్ షేర్ చేసుకునేందుకు స్పాటిఫై లింక్ కూడా ఇందులో ఉంటుంది. 

 

ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ పుణ్యమా అని నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోయిన జంటలకు ఈ యాప్ బాగా ఉపయోగకరంగా ఉంటుందేమో. అయితే ఇందులో మాత్రం సోషల్ మీడియా బాదరబందీ ఇందులో ఉండదు. నాకు నువ్వు, నీకు నేను అంటూ ఇద్దరే ఉంటారు మరి. మ్యూజిక్ తోపాటు ఫొటోలు, వాయిస్ నోట్స్ ఇలా ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఉండేవి అన్నీ ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కి మీ భార్య మీ మీద అలిగితే దానికి త‌గ్గ మ్యూజిక్‌ని పంపించ‌వ‌చ్చు అలా  జంటల మధ్య అనుబంధాన్ని ఇనుమడింపజేసేందుకు ఈ యాప్ రూపొందించారట. ప్రస్తుతానికి మటుకు ఈ యాప్ కేవలం యాపిల్ ఐఫోన్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉందట. త్వ‌ర‌లోనే మిగ‌తా వాటికి కూడా వ‌స్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: