లాక్ డౌన్ నేపథ్యంలో  దేశ వ్యాప్తంగా వైన్స్ లు, బార్లు మూతబడ్డాయి.  దీంతో CIABC (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్) కి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ‌ప‌డింది. కాగా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిమిత సమయంలో అనుమతించాల‌ని కోరింది. మూతబడివున్న వైన్ షాపులను ఓపెన్ చేయించాలని తెలంగాణతో సహా 10 రాష్ట్ర ముఖ్యమంత్రులకు CIABC డైరెక్టర్ జనరల్‌ వినోద్‌ గిరి కోరారు. లాక్‌ డౌన్‌ నిబంధనల మేరకు మద్యం షాపులను మూసివేసినప్పటికి ఎన్నో ప్రాంతాల్లో అక్రమ అమ్మకాలు జరుగుతూనే వున్నాయని, షాపుల మూసివేతతో తాగుడుకు అలవాటు పడినవారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం భవిష్యత్తులో శాంతి భద్రతలపైనా పడవచ్చని హెచ్చరించారు. నిర్ణీత పని వేళలను, సామాజిక దూరాన్ని పాటిస్తూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని షాపులను తెరిపించాలని ఆయన సూచించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాల విషయంలో సడలింపులు ఇచ్చాయని గుర్తు చేసిన ఆయన, ప్రజారోగ్యం దృష్ట్యా, రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు.మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాల్సిదే ?

మరింత సమాచారం తెలుసుకోండి: